శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: బుధవారం, 8 అక్టోబరు 2014 (18:36 IST)

యోని పెదవులకు పురుషాంగ తగలగానే స్ఖలనమౌతోంది... ఆమె విసుక్కుంటోంది.

అంగప్రవేశ సమయంలో యోని పెదువులను తగిలీతగలగానే వీర్యం యోని బయటే స్ఖలనమైపోతోంది. దీనివల్ల నా భార్య చాలా చిరాకు పడుతోంది. నేను సెక్స్‌కు పనికిరానేమోనని భయంగా ఉంది. పరిష్కార మార్గం ఏమిటి..? 
 
శీఘ్రస్ఖలనం చాలా తీవ్రంగా అంటే అంగప్రవేశమే చేయలేనంత వేగంగా స్ఖలనం అయిపోవడం జరుగుతుంది. దీనివల్ల దంపతులిద్దరూ సంతృప్తిని పొందలేరు. శీఘ్రస్ఖలన సమస్య వల్ల శృంగారంలో భాగస్వామి అసంతృప్తికి లోనుకావడం సహజమే. దీనివల్ల ఆందోళన మరింత పెరిగి, ఒత్తిడికి గురై ఎలాగైనా విజయవంతంగా సెక్స్ చేయాలని ప్రయత్నించినప్పటికీ మళ్లీ శీఘ్రస్ఖలనం అవుతుంటుంది. 
 
శీఘ్రస్ఖలనం తగ్గించుకోకపోతే మెల్లగా ఆసక్తి తగ్గిపోయి, డిప్రెషన్ పెరిగి అంగస్తంభన సమస్య వస్తుంది. దంపతుల మధ్య గొడవలు వస్తాయి. దూరాలు పెరుగుతాయి. శీఘ్రస్ఖలన సమస్య ప్రోస్టేట్ గ్రంథి వ్యాధుల్లో, దీర్ఘకాలిక మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌లో సెక్స్ కండరాలు బలహీనమవడంతో వస్తుంది. అందువల్ల మంచి సెక్సాలజిస్టును కలిసి చికిత్స తీసుకోండి.