శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: మంగళవారం, 14 అక్టోబరు 2014 (13:54 IST)

గర్ల్ ఫ్రెండ్ తో యానల్ సెక్స్ చేయాలనుకుంటున్నా.... బాగా ప్లెజర్ ఉంటుందా...?

ఇంకా పెళ్లి కాలేదు. ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. ఈమధ్య రెండుమూడుసార్లు సెక్స్ చేసేందుకు నేను గర్ల్ ఫ్రెండుపై ఒత్తిడి తెచ్చాను. పెళ్లికి ముందు సెక్స్ చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుందని ఆమె భయపడుతుంది. యానల్ సెక్సులో పాల్గొంటే ప్రెగ్నెన్సీ రాదని అంటున్నారు. ఐతే ఈ పద్ధతిలో మా ఇద్దరికీ యోని ద్వారా చేసినప్పుడు కలిగే తృప్తి కలుగుతుందా...?
 
యానల్ సెక్స్ అనేది అసహజమైన రతిగానే చెప్పబడుతుంది. ఎందుకంటే స్త్రీపురుషులు యోని మార్గం ద్వారా పురుషాంగాన్ని ప్రవేశపెట్టి చేసేదే సహజ రతిగా చెప్పబడుతుంది. యోని సెక్సులో యోని వద్ద సెక్సుకు అనుకూలంగా ద్రవాలు స్రవిస్తుంటాయి. దాంతో పురుషాంగ ప్రవేశం సుళువవుతుంది. ఇంకా పురుషాంగం స్తంభించేకొద్దీ యోని మార్గం కూడా దానికి అనుగుణంగా సాగుతూ ఉంటుంది. 
 
ఈ పద్ధతిలో స్త్రీ పురుషులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ యానల్ సెక్సులో స్త్రీ చాలా బాధను అనుభవిస్తుంది. ఆ మార్గంలో సెక్సుకు అనువైన స్రవాలు విడుదల కావడం అనేది ఉండదు. పైగా మల మార్గం కనుక ఇన్ఫెక్షన్ సోకే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి యానల్ సెక్సులో పాల్గొనాలంటే స్త్రీ మలమార్గాన్ని ప్రత్యేకంగా శుభ్రపరిచి ఆ తర్వాత పాల్గొనాల్సి ఉంటుంది. ఐనప్పటికీ ఆ మార్గం ఎంతమాత్రం సురక్షితమైనది కాదు.