బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Updated : గురువారం, 31 మే 2018 (21:12 IST)

శృంగారం సమస్యలు

త్వరలో పెళ్లాడబోతున్నాం. ఐతే పెళ్లికి ముందు ఒక్కసారి సెక్స్ అనుభవం పొందుదామని పాల్గొన్నాం. సెక్సు చేస్తున్నంతసేపూ ఆమెలో ఎలాంటి ఫీలింగ్ లేదు. భావప్రాప్తి సమయంలో స్త్రీ తృప్తితో కళ్లవెంట నీళ్లు వస్తాయంటారు. అలాంటిది... ఆమెకు ఆ ఫీలింగ్ ఏమీ లేకపోగా... నీ పురుషాంగం పొడవెంత...? అని ప్రశ్నించింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు... అసలు పురుషాంగం పొడవు ఎంత ఉండాలి...?
 
ఆమె పురుషాంగం పొడవు ఎందుకోసం అడిగిందన్నది మీరు తెలుసుకోలేదు. కానీ పురుషాంగం పొడవు ఎంత అనేసరికి పురుషాంగం సామర్థ్యంపై అనుమానం కలిగింది. నిజానికి స్త్రీలలో ఒక్క శాతం మంది మాత్రమే పురుషాంగం సైజు పెద్దదిగా ఉండాలని పట్టించుకుంటారని ఒక సర్వేలో తేలింది. మిగిలినవారంతా పురుషాంగం పటుత్వంగా, స్తంభించే ఉంటే చాలని అనుకుంటారు. ఎందుకంటే స్తంభించిన పురుషాంగం యోనిలో ప్రవేశించినపుడు అది స్త్రీని సెక్స్ పరంగా భావప్రాప్తికి చేరుస్తుంది. 
 
పురుషాంగం పొడవు ఎంత ఉన్నప్పటికీ స్తంభించి లేకపోయినట్లయితే ఆ సైజుతో ఏమీ చేయలేనట్లవుతాడు పురుషుడు. ఐతే పురుషాంగం సైజు గురించి స్త్రీలు పెద్దగా పట్టించుకోకపోయినా పురుషుల్లో మాత్రం దాదాపు 20 శాతం తమ అంగ పరిమాణం గురించి వర్రీ అవుతుంటారని తేలింది. 
 
ఇకపోతే పురుషాంగం స్తంభించి ఉన్నప్పుడు పురుషుని పురుషాంగం 13 సెంటీమీటర్లు ఉంటుంది. ఐతే ఇది కొందరిలో 9 సెంటీమీటర్లే ఉంటే మరికొందరిలో ఇది 16 సెంటీమీటర్ల దాకా ఉండొచ్చు. మొత్తమ్మీద 9 నుంచి 16 సెంటీమీటర్ల మధ్య స్తంభించిన పురుషాంగం ఉంటుందని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.