గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By CVR
Last Modified: శుక్రవారం, 24 అక్టోబరు 2014 (18:41 IST)

అలాంటి సమయాల్లో సెక్స్ చేస్తే ప్రాణానికే ప్రమాదం...

స్త్రీపురుషుల మధ్య సెక్స్ ఆరోగ్యకరమైనదే. అయితే అదే సెక్స్ కొన్ని సందర్భాలలో ప్రాణాంతకంగానూ మారుతుంది. ఎటువంటి సమయాల్లో సెక్స్ ప్రాణాలు హరిస్తుందో వివరిస్తున్నారు నిపుణులు...
 
పురుషులకు, మహిళలకు మధ్య ఎక్కువ వయస్సు తేడా ఉన్న పక్షంలో వారు సెక్స్ చేసే సమయంలో ఎక్కువ వయసున్నవారిలో ఉద్రేకస్థాయి అధికమైతే అది అకస్మాత్తు మరణానికి దారితీసే ప్రమాదం ఉందంటున్నారు. అందుకు కారణం... సెక్స్ సమయంలో వారి హృదయం వేగంగా కొట్టుకోవడం, రక్తం సరఫరాలో తేడాలు ఉండడం కారణంగా, రక్త నాళాలు పూడుకుపోవడంతో ఆకస్మిక మరణాలు సంభవిస్తాయంటున్నారు నిపుణులు.
 
సెక్స్‌కు ముందు దంపతులు మద్యం సేవించడం, పొగ తాగడం కూడా ప్రాణాంతకమైనదేనంటున్నారు. అతి వేగంగా సెక్స్ చేయడం వలన కూడా ప్రాణ హాని లేకపోలేదంటున్నారు. కనుక అనవసరమైన కామ ప్రేరిత మత్తు పదార్ధాలు సేవించరాదంటున్నారు. 
 
ఒకే రోజు ఎక్కువ సార్లు సెక్స్ చేయడం కూడా హానిని కలుగ చేస్తుంది. ఎందుకంటే సెక్స్ చేసే సమయంలో ఉద్రేకం పెరుగుతుంది. తద్వారా హృదయం మితిమీరిన వేగంతో కొట్టుకుంటూ ఈ విధంగా ఒకే రోజు హృదయ స్పందనల్లో మార్పులు చోటుచేసుకున్నట్లైతే అకస్మాత్తుగా స్ట్రోక్ ఏర్పడే అవకాశం ఉందంటున్నారు.
 
మత్తు పదార్థాలు తీసుకుని భాగస్వామిని సెక్స్‌కు బలవంతంగా పిలవడం ఆపదకు దారితీస్తుంది. మద్యం మత్తులో ఉన్నప్పుడు తీవ్ర ఆవేశానికి లోనుకావడం వలన కూడా ఆకస్మిక మరణాలు సంభవించేందుకు కారణమవుతాయనేది నిపుణలు మాట. 
 
హైపర్‌టెన్షన్, హృదయ సంబంధిత వ్యాధులు గల వారు అత్యధిక స్థాయిలో సెక్స్‌లో పాల్గొంటే రక్త ప్రవాహ వేగం పెరిగి కొన్నిసార్లు అది మృతికి దారితీసే అవకాశం ఉందంటున్నారు.
 
అదేవిధంగా అధిక దూరం ప్రయాణించి, అలసట తీరకముందే సెక్స్ చేయడం కూడా ఆపదతో కూడుకున్నదే అంటున్నారు. ప్రయాణ బడలికలో ఉండేవారు కొంచెం రిలాక్స్ అయిన తర్వాత స్నానం చేసి, తర్వాత అవసరం అనుకుంటే సెక్స్ చేయవచ్చును. పురుషాంగం ఎక్కువ సేపు స్తంభించి ఉండేందుకు మందులు తీసుకుని, బలమైన స్ట్రోక్స్ ఇస్తూ సెక్స్ చేయడం ద్వారా కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.