శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: గురువారం, 19 ఫిబ్రవరి 2015 (18:42 IST)

మొదటిసారి సెక్స్ చేశాడు... రక్తం రాగానే భయపడి రావడంలేదు...

మా ఇద్దరికీ ఇంకా పెళ్లి కాలేదు. త్వరలో చేసుకోబోతున్నాం. నన్ను ప్రేమిస్తున్న అబ్బాయి మరెవరో కాదు. మా బావే. ఐతే మొన్నీమధ్య ఇద్దరం ఏకాంతంగా గడిపే అవకాశం వచ్చింది. ఎప్పుడూ ముద్దులు, కౌగలింతలతో ఉండే మేము సెక్స్ కోర్కెలు విపరీతం కావడంతో అతడు అంగ ప్రవేశం చేశాడు. ఐతే అది అంత సుళువుగా జరుగలేదు. పావుగంటకు పైగా ప్రయత్నించి చేశాడు. 
 
అతడలా అంగ ప్రవేశం చేశాడో లేదో వెంటనే యోని వద్ద రక్తం కారింది. అది చూసిన అతడు వెంటనే సెక్స్ చేయడం ఆపేశాడు. రక్తం చూసి భయపడిపోయాడు. ఏదో జరిగిపోయిందంటూ నన్ను గాభరా చేశాడు. నేను వెంటనే నా స్నేహితురాలికి ఫోన్ చేస్తే కన్నెపొర చిరిగి ఉంటుందని చెప్పింది. ఐతే నాకు అలా అనిపించడంలేదు... యోని మార్గం ఏమైనా చిన్నదిగా ఉందేమోనని అనుమానంగా ఉంది...

 
పెళ్లి కాకుండానే సెక్సులో పాల్గొంటే ఇలాంటి భయం, ఆందోళన సహజంగా కలుగుతుంది. మీ ఇద్దరిలోనూ ఎలాంటి లోపాలు లేవని అనుకోవచ్చు. కన్నెపొర కొందరిలో దళసరిగా ఉండటంతో ఇలా సెక్సులో పాల్గొన్నప్పుడు అది చిరిగి రక్తం కారవచ్చు. అలాగే పెళ్లి కాకుండా సెక్సులో పాల్గొనేటపుడు భయంతో కొంతమంది అమ్మాయిలు బిగుసుకుపోతారు. ఆ కారణంగా యోని మార్గం బిగుతుగా మారుతుంది. ఫలితంగా ఇలాంటి సమస్య తలెత్తవచ్చు. కాబట్టి రక్తం రాగానే భయపడాల్సిందేమీ లేదు.