గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: మంగళవారం, 24 ఫిబ్రవరి 2015 (20:39 IST)

అంగస్తంభనలో బలహీనతకు షుగర్ వ్యాధి కూడా కారణమవుతుందా...?

షుగర్ వ్యాధివల్ల పురుషాంగంలోని అతి సున్నిత నరాలు మొద్దుబారిపోతాయి. దీంతో మెదడులో సెక్స్ ఉద్దీపనలు కలిగినప్పటికీ దాని సంకేతాలను కానీ, ప్రేరణలను కానీ కలిగి ఉత్తేజం రాదు. 
 
ఆ భాగంలోని నరాలు మొద్దుబారి ఉండటం వల్ల పురుషాంగంలోని రక్తనాళాలని, రక్తం చేరే గదులని వ్యాకోచించేటట్లు ప్రేరేపించలేకపోతాయి. మెదడులో తయారయ్యే న్యూరోట్రాన్స్ మీటర్స్ సెక్స్ ప్రేరకాలుగా పనిచేస్తాయి. మధుమేహం ఉన్నవారిలో ఇవి తగ్గిపోతాయి. దానివల్ల పురుషాంగం సరిగా స్తంభించకుండా ఉంటుంది. 
 
షుగర్ వ్యాధి ఉన్నవారిలో సెక్స్‌లో విఫలం చెందుతున్నప్పుడు నిజంగానే నరాలు మొద్దుబారిపోయాయా..? రక్త నాళాలు సన్నబడి రక్తప్రసారం తగ్గిపోయిందా అని తెలుసుకోవడానికి నిద్రపోతున్నప్పుడు భాగస్వామి అంగాన్ని స్పృశించినప్పుడు అది గట్టిపడి స్తంభిస్తుందో లేదో చూడాలి. 
 
పురుషాంగం గట్టిపడితే సెక్స్‌లో వైఫల్యమనేది షుగర్ వ్యాధివల్ల మనసులో కలిగిన దిగులు వల్లనే అని తెలుసుకోవాలి. ఆ దిగులు వదిలేందుకు తగిన కృషి చేయాల్సి ఉంటుంది.