గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Updated : బుధవారం, 13 మే 2015 (18:46 IST)

పెళ్లి చేసుకున్నాను... పడకగదికెళితే బతిమాలుతోంది... ధైర్యం చేస్తే కొరికింది...

పెళ్లయి మూడు నెలలు దాటింది. ఐతే మొన్నటివరకూ ఆమెతో సెక్సులో పాల్గొనలేదు. దానికి కారణం ఆమె శరీరంపై చేయి వేస్తే వణికిపోతోంది. నన్ను ఏమీ చేయవద్దు అంటూ బతిమాలుతోంది. అందువల్ల కనీసం ముద్దులు, కౌగలింతలు కూడా చేయకుండా నెట్టుకొచ్చాను. కానీ ఇలా ఎంతకాలం అని మొన్నీమధ్య ధైర్యం చేసి ముద్దుపెట్టి గట్టిగా కౌగలించుకున్నాను. 
 
ఆమె దానికి బాగానే స్పందించింది. ఇక సెక్సుకు అడ్డు చెప్పదనుకుని గబుక్కును దుస్తులు తొలగించి యోనిపై చేయి వేసి అంగ ప్రవేశం చేయాలని ప్రయత్నించా. అంతే.. గట్టిగా భుజంపై కొరికింది. నొప్పితో ప్రాణం లేచిపోయింది. కొట్టాలనిపించింది. కానీ, ఆమె మనస్తత్వం తెలిసినందువల్ల ఏమీ చేయలేదు. ఆమె ఎందుకిలా ప్రవర్తిస్తుందీ...?
 
పెళ్లయిన కొత్త జంటల్లో కొంతమందికి ఇటువంటి ఇబ్బందికర పరిస్థితి నెలకొంటుంది. కొత్తగా పెళ్లయిన తర్వాత భార్యకు సెక్స్ పట్ల ఉన్న అనుమానాలు, అపోహలను ఎంతమాత్రం నివృత్తి చేయకుండా నేరుగా అక్కడికే వెళ్లిపోతుంటారు చాలామంది భర్తలు.
 
కొంతమందైతే భార్యను మెల్లిగా తమ దారిలోకి తెచ్చుకునే మార్గం ఆలోచించకుండా పానీయాల్లో కాస్త మత్తు పదార్థాల్లాంటివి కలిపి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటువంటివి తప్పు. ఆమె పెరిగిన వాతావరణాన్నిబట్టి, కుటుంబ పరిస్థితుల్ని బట్టి కొంతమందిలో సెక్స్‌పై ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటివారిలో సెక్స్ విషయంలో మనస్సు స్పందించదు. 
 
అలా స్పందించనప్పుడు భర్త పట్ల కూడా అయిష్టత ఏర్పడుతుంది. అది గమనించి కొంతకాలం సెక్స్ కు దూరంగా ఉండాలి. ప్రేమగా మెలగాలి. ఆమెను సంతోషపెట్టే పనులేమిటో తెలుసుకుని వాటిని చేయాలి. స్నేహంగా ఉండాలి. సున్నితంగా వ్యవహరిస్తూ మెల్లిగా ఆమెకు దగ్గరవ్వాలి. భర్త పట్ల ప్రేమ, ఆప్యాయతలు కలిగే వరకూ ఓపిక పట్టాలి. మీపై ప్రేమ కట్టలు తెంచుకున్నప్పుడు సెక్స్ కు ఆమె ఉద్యుక్తురాలై ఆహ్వానిస్తుంది. ఆమె మిమ్మల్ని ముద్దులు, కౌగిళ్ల వరకూ అడ్డు చెప్పేలేదు కదా. ఇంకొన్ని రోజులు అలా కంటిన్యూ చేసి ఉంటే అనుకున్నవిధంగా సజావుగా సెక్స్ చేసే అవకాశం ఉండేదు. కనుక ఇటువంటివారి విషయంలో ఓర్పే మంచిమందు.