గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: గురువారం, 21 మే 2015 (17:44 IST)

ప్రెగ్నెన్సీ వస్తుందని అంటే సున్తీ చేయించుకోలేదు కదా అంటున్నాడట...

నా స్నేహితురాలు ఓ అబ్బాయిని ప్రేమిస్తోంది. అతడు పెళ్లి చేసుకునేదాకా ఆగలేను ఇప్పుడే సెక్స్ కావాలని గోల చేస్తున్నాడట. ఐతే అతడిని కండోమ్ ధరించమంటే తనకు సున్తీ కాలేదనీ, అందువల్ల ప్రెగ్నెన్సీ భయం అక్కర్లేదని చెపుతున్నాడట. అలా సెక్సులో పాల్గొంటే గర్భం రాదా...?
 
సున్తీ చేయించుకోవడం కొందరిలో సంప్రదాయంగా ఉంటే, మరికొందరికి పురుషాంగం పూర్వచర్మం శిశ్నాన్ని బిగుతుగా పట్టి ఉంచడంతో చేస్తారు. ఐతే సెక్సులో పాల్గొనేటప్పుడు సున్తీ చేయించుకున్నా, చేయించుకోకపోయినా పురుషాంగం స్తంభించి ఉంటుంది. యోని ప్రవేశం చేసిన తర్వాత వీర్యస్ఖలనాన్ని సున్తీ చేయించుకోనీ లేదా చేయించుకున్నప్పటికీ జరిగిపోతుంది. కనుక సున్తీ చేయించుకోకపోతే గర్భం రాదని అనుకోవడం పొరబాటు.