బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శనివారం, 23 మే 2015 (16:30 IST)

ప్రతిరోజూ కండోమ్ ఉపయోగించి సెక్స్ చేస్తావేమిటి అని విసుక్కుంటోంది... వేరే మార్గం?!!

గర్భం రాకూడదని నా భార్యతో నేను సెక్సులో పాల్గొన్న ప్రతిసారీ కండోమ్ వాడుతున్నాను. దీనితో ఆమె విసుక్కుంటోంది. ప్రతిరోజూ కండోమ్ ధరించి చేస్తావేమిటి అని మండిపడుతోంది. ఆమె కొన్ని రోజులు చెప్పి ఆ రోజుల్లో కండోమ్ లేకుండా పాల్గొనమంటోంది. అసలు అండం విడుదల సమయంలోనే కండోమ్ వాడితే సరిపోతుందా...? ఈ అండం విడుదలయ్యేందుకు ఖచ్చితమైన రోజులు ఏమైనా ఉన్నాయా..? గర్భం రాకుండా ఉండేందుకు మాత్రలు మింగి సెక్సులో పాల్గొనవచ్చా...?
 
స్త్రీలకు మెన్సస్ వచ్చిన తర్వాత రోజు నుంచి 18వ రోజు వరకూ గర్భం వచ్చే కాలం. నెల మధ్యలో లేదంటే మరెప్పుడైనా సెక్సులో పాల్గొంటే గర్భం రాకుండా ఉండేందుకు టుడే- వెజైనల్ మాత్రలు ఉపయోగపడుతాయి. ఈ టాబ్లెట్లు సెక్సుకు ముందు స్త్రీలు యోనిలో పెట్టుకోవాలి. ఇవి మింగే టాబ్లెట్లు కాదు. యోని లోపల పెట్టుకునే ఈ టాబ్లెట్లు ఎలాంటి అనారోగ్యాన్ని కలిగించవు. ఐతే ఎన్నిసార్లు సెక్సులో పాల్గొంటే అన్నిసార్లు ఈ మాత్రలను సెక్సుకు ఉపక్రమించబోయే పది నిమిషాల ముందు యోనిలో ఉంచుకోవాలి. ఇవి వెంటనే కరిగిపోతాయి. అలా కరిగిన ఈ మాత్రలు వీర్యకణాలను నిర్వీర్యం చేసి గర్భం రాకుండా చేస్తాయి.