బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: బుధవారం, 27 మే 2015 (18:05 IST)

పొరబాటును చిన్ననాటి స్నేహితుడితో సెక్సులో పాల్గొన్నా... ఆవేదన కలుగుతోంది..

కొన్ని జంటల విషయంలో ఇలాంటి అరుదైన సంఘటనలు జరుగుతుంటాయి. సహజంగా చిన్నప్పట్నుంచి స్నేహితులుగా ఉండటంతో వారిపై పెద్దల అజమాయిషీ కూడా తక్కువగానే ఉంటుంది. అమ్మాయి, అబ్బాయిలను స్వేచ్ఛగా వదిలేస్తారు. యుక్త వయసు వచ్చినా పట్టించుకోరు. కానీ ఇదే ఇబ్బంది తెస్తుంది. 
 
చిన్నప్పుడు వారిలో ఉన్నటువంటి భావాలు పెద్దయిన తర్వాత కూడా ఉన్నప్పటికీ శరీరంలో వచ్చే మార్పులు వారిలో ఏవేవో ఆశలు రేకెత్తిస్తాయి. యవ్వనంలో ఉన్న అమ్మాయి శరీరం అబ్బాయి శరీరానికి తాకినపుడు కలిగే స్పందనల ఫలితం భిన్నంగా ఉంటుంది. అదే చివరికి సెక్స్ కు దారితీస్తుంది. ఈ కోర్కెను కొంతమంది మాత్రమే అదిమిపెట్టుకోగలరు. 
 
చాలామంది స్నేహితుడు లేదా స్నేహితురాలుగా చిన్నప్పట్నుంచి కలిసే పెరిగారు కాబట్టి వెంటనే తమలో రేగిన కోర్కెను క్యాజువల్ గా చెప్పేస్తారు కూడా. అది అవతలివారిలోనూ ఆల్రెడీ ఉన్నట్లయితే ఇక వారు సెక్సులో పాల్గొనడం సుళువయిపోతుంది. 
 
కనుక యుక్తవయసు వచ్చిన పిల్లలకు సెక్సుకు సంబంధించిన పరిజ్ఞానం, విషయాలను వీలు దొరికినపుడల్లా తల్లిదండ్రులు చెపుతుండాలి. లేదంటే స్నేహితులుగా ఉన్నవారు కాస్తా పెళ్లి కాకుండానే సెక్సు జీవితాన్ని గడిపేస్తారు. 
 
ఇక పెళ్లికి ముందు సెక్స్ అనేది ఖచ్చితంగా తప్పే అవుతుంది. ఒకవేళ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ విషయం పెద్దలతో చెప్పి పెళ్లాడి తదుపరి దాంపత్య సుఖాన్ని ఆస్వాదించవచ్చు.