శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: మంగళవారం, 23 జూన్ 2015 (15:47 IST)

సెక్స్ చేయబోతే హెచ్ఐవి టెస్ట్ చేయించాలంటోంది... ఈమెను నేనెలా పెళ్లి చేస్కోవాలి...

మేమిద్దరం గత ఏడాదిగా ప్రేమించుకుంటున్నాం. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. ఐతే నాకు నలుగురైదుగురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వారితో స్నేహం మాత్రమే చేస్తాను. నా ప్రేయసితో మాత్రమే శృంగార సంబంధమైనవి చేస్తుంటాను. పోయినవారం ఇద్దరం ఏకాంతంగా గడిపే అవకాశం వచ్చింది. దాంతో నాలో సెక్స్ కోర్కెలు విపరీతంగా కలిగాయి. ఆమె మరీ అంత సన్నిహితంగా వచ్చేసరికి ఆమెతో సెక్సులో పాల్గొనాలనిపించింది. కావాలని అడిగితే ముందు వారించింది. 
 
మరీ ఒత్తిడి చేసేసరికి ఆమె నాతో అన్న మాటలకు మైండ్ బ్లాంక్ అయింది. సెక్సులో పాల్గొనాలంటే హెచ్ఐవి టెస్ట్ చేయించి చెక్ చేసుకున్న తర్వాత పాల్గొందామని అంటోంది. ఆమె అంటున్నదాన్ని బట్టి నాపైన అనుమానమా అంటే అది కాదంటోంది. మరి ఎందుకీ హెచ్ఐవి టెస్ట్ అంటే మాట్లాడటం లేదు. ఇలాంటి అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే సమస్యలు తలెత్తుతాయేమోనని అనిపిస్తోంది... ఏమంటారు..?
 
పెళ్లికి ముందు సెక్సులో పాల్గొనాలనుకోవడం తప్పు. ఇకపోతే ఆమె అడిగినదాంట్లో తప్పేమీ లేదు. ఆమె మిమ్మల్ని ఒక్క విషయమే అడిగింది. కానీ ఒక సర్వే ప్రకారం నేటి అమ్మాయిలు చాలా విషయాల్లో అబ్బాయిలను చెక్ చేసుకోవాలనుకుంటున్నట్లు తేలింది. అందులో మీరు చెప్పినది కూడా ఉంది. హెచ్ఐవి టెస్టుతోపాటు కాబోయే భర్తకు వంట తెలిసి ఉండాలని కోరుకుంటున్నారు. 
 
అలాగే సెక్స్ గురించి ఎలాంటి సందేహాలనైనా నిస్సందేహంగా చర్చించేటపుడు వాటికి సమాధానాలు చెప్పాలి కానీ ఇగోలకు పోకూడదని అనుకుంటున్నారు. ఇంకా పరాయి స్త్రీలతో పోలికలు, పెళ్లయిన వెంటనే పిల్లలు కావాలని ఒత్తిడి చేయడాలు, కెరీర్ గురించి లెక్చర్లివ్వడాలు వంటివి అమ్మాయిలు ఇష్టపడరని తేలింది. కాబట్టి మిమ్మల్ని అడిగిన అమ్మాయి ఒక్క విషయం గురించే అడిగింది. అదికూడా సెక్స్ కావాలని అడినప్పుడు.