గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శుక్రవారం, 12 సెప్టెంబరు 2014 (17:09 IST)

నా గర్ల్ ఫ్రెండ్‌తో సెక్స్ చేయాలనుకుంటున్నా... ఎక్కడ చేస్తే బావుంటుంది...?

నా వయసు 23 ఏళ్లు. నా గర్ల్ ఫ్రెండు, నేను గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. అది కూడా ఎక్కువగా ఫోనులోనే మాట్లాడుకుంటాం. ఇద్దరం కలిసి దగ్గరగా మాట్లాడుకునే సందర్భాలు చాలా తక్కువ. ఒకటిరెండుసార్లు మాత్రమే ఆమెను ముద్దు పెట్టుకున్నాను. ఈమధ్య నాలో సెక్స్ కోర్కెలు విపరీతంగా వస్తున్నాయి. తట్టుకోలేక హస్త ప్రయోగం చేసుకుంటున్నాను. ఈ విషయాన్ని నా గర్ల్ ఫ్రెండుకు చెప్పి సెక్స్ కావాలని బతిమాలాను. ఆమె సరేనంది. హోటల్, టూరిస్ట్ ప్లేస్ ఎక్కడికి వెళ్దామన్నా ఒప్పుకోవడంలేదు. ఎలాంటి చోటయితే మేమిద్దరం సెక్సులో సంతోషంగా పాల్గొనగలుగుతాము...?
 
ఇంతవరకూ మీ చదువు పూర్తికాలేదు. ఇంకా పెళ్లయ్యేందుకు రెండుమూడేళ్లు పట్టే సమయం ఉంది. ఈమధ్యలోనే ఆమెతో సెక్సులో పాల్గొంటే ఆమె పెళ్లి కాకుండానే గర్భం దాల్చితే ఏం చేస్తారు...? ప్రేమించుకోవడం తప్పు కాకపోయినా పెళ్లి కాకుండా సెక్స్ కోసం తాపత్రయపడటం మంచిది కాదు. ఇలాంటి సెక్స్ భవిష్యత్తులో చాలా ఇబ్బందులు తెస్తుంది. ముందుగా మీరు అలాంటి ఆలోచనలు పక్కనపెట్టి చదువు పూర్తి చేసి ఉద్యోగంలో స్థిరపడ్డాక మీ ప్రేయసిని పెళ్లాడి ఆ తర్వాత దాంపత్య సుఖాన్ని చవిచూడండి. అంతవరకూ ఓర్పుగా ఉండాల్సిందే ఇద్దరూ.