శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: మంగళవారం, 9 డిశెంబరు 2014 (15:58 IST)

యోని వదులుగా వుందని సెక్స్ చేయడంలేదు... పిల్లలు పుడితే లూజవుతుందా?

పిల్లలు పుట్టిన తర్వాత యోని లూజు అవుతుందనే అపోహ కొంతమందిలో ఉంటుంది. ముఖ్యంగా నార్మల్ డెలివరీ అయిన మహిళల్లో ఈ తరహా భావం ఉంటుంది. దీంతో భర్తకు పూర్తి సుఖం ఇవ్వలేనన్న ఫీలింగ్ వారిని వెంటాడుతూ ఉంటుంది. కొంతమంది భర్తలు సెక్స్‌లో సంతృప్తి లభించనపుడు మానసికంగా, సెక్స్ పరంగా భార్యను వేధిస్తుంటారు. 
 
ఐతే పిల్లలు పుట్టాక యోని వదులవుతుందనడంలో ఏమాత్రం నిజం లేదు. ప్రసవ సమయంలో బిడ్డ బయటకు రావడానికి వ్యాకోచించిన యోని కండరాలు తిరిగి సంకోచించి పూర్వస్థితికి చేరుకుని అదే పటుత్వంతో ఉంటాయి. తక్కువ సమయపు ఫోర్ ప్లే వల్ల యోని స్రావాలు విడుదలై అంగ ప్రవేశం సులువుగా జరుగుతుంది
 
ఫోర్ ప్లే కొంచెం ఎక్కువ సేపు కనీసం 20-25 నిమిషాలు చేస్తే స్రావాలు ఊరినా, యోని బయటి వైపు గోడలలో రక్త ప్రసరణ పెరిగి అక్కడి మెత్తటి కండరాలు, రక్త నాళాలు ఉబ్బి యోని నాళం బిగుతుగా అవుతుంది. సెక్స్ కోర్కె మరీ తారాస్థాయికి వెళ్లినపుడు ఇలా స్రవాలు అధికమై లూజుగా ఉన్నట్లు అనిపిస్తుంది. అంతేతప్ప పిల్లలు పుడితే యోని లూజవడం అనేది ఉండదు.