గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2015 (18:08 IST)

నాకు, మా బావకు పెళ్లి ఫిక్స్ చేశారు.. ఓసారి సెక్స్ చేద్దామంటున్నాడు.. ఏం చేయాలి?

మాది ఓ పల్లెటూరు. మా బావ ఓ పట్టణంలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే, మా రెండు కుటుంబాలు కలిసి మా యిద్దరికి వివాహం చేయాలని నిర్ణయించి, పెళ్లి ఫిక్స్ చేశారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. అయితే, మనకి ఎలాగూ పెళ్లి అవుతుంది కదా ఈలోగా ఓసారి సెక్స్ చేసుకుందామనీ మా బావ ప్రతిపాదించాడు. నేను ఒప్పకోలేదు. దీంతో ఓ రోజున ఎవరూ లేనపుడు.. నా వక్షోజాలను గట్టిగా పట్టుకున్నాడు. అపుడు అమితమైన నొప్పి కలిగింది. రేపు పెళ్లి అయ్యాక కూడా నొప్పి కూడా ఇలానే ఉంటుందా.? ఇదే విధంగా ఉంటే మా బావను నేను సుఖపెట్టగలనా? 
 
సాధారణంగా స్తనాలను సున్నితంగా స్పృశించాల్సి ఉంటుంది. అలా చేస్తుంటే స్త్రీలకు ఎంతో హాయిగా ఉంటుంది. సెక్స్‌కు ముందు ఇష్టత ఏర్పడుతుంది. యోనిలో ద్రవాలు విడుదలవుతాయి. దీంతో యోని జారుడుగా తయారవుతుంది. అపుడు అంగ ప్రవేశం చేస్తే సులువుగా జరుగుతుంది. అవే స్తనాలను గట్టిగా ఒత్తడం వల్ల అవి నొప్పిపుట్టడం సహజమే. ఎందుకంటే పాలిండ్లలో పాలగడ్డలు ఉంటాయి. గట్టిగా ఒత్తడం వల్ల ఆ గడ్డల్లో ఒత్తిడి పెరిగి నొప్పి కలుగుతుంది. 
 
ఇకపోతే.. పెళ్లికి ముందు సెక్స్ అనేది ఏమాత్రం మంచిది కాదు. ఈ విషయంలో సొంత బావ అయినా సరే. వివాహమయ్యేంత వరకు రతికి దూరంగా ఉండటమే ఇరువురికీ మేలు. అదేసమయంలో కొత్త జంటలు పడక గదిలో ఒకరినొకరు సహకరించుకుంటూ ముందుకు సాగినట్టయితే అన్నీ అనుకూలంగా సాగిపోతాయి.