బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (20:21 IST)

ఫోనులో ఆమెతో సెక్స్ గురించి మాట్లాడా... అడిగితే ఏమవుతుందో...?

నా వయసు 42 ఏళ్లు. నేను ఉద్యోగం నిమిత్తం మెట్రో నగరంలో ఉన్నాను. నా భార్య మరో ఊరిలో ఉద్యోగం చేస్తోంది. నేను ఇక్కడ ఒంటరిగానే ఉంటున్నాను. నేను పనిచేసే ఆఫీసులోనే 37 ఏళ్ల మహిళతో బాగా స్నేహం ఏర్పడింది. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమె భర్త కూడా వేరే ఊరిలో పని చేస్తుంటారట. అప్పుడప్పుడూ వచ్చి వెళుతుంటారని చెపుతుంది. 
 
ఎందుకో ఆమెతో ఈమధ్య బాగా కనెక్ట్ అయిపోయాననిపిస్తోంది. రోజూ ఫోనులో మాట్లాడందే ఉండలేకపోతున్నాను. ఈమధ్య ఇద్దరం కొద్దిసేపు మా సెక్స్ లైఫ్ గురించి మాట్లాడుకున్నాం. ఆమె తన దాంపత్యం గురించి చెప్పుకొచ్చింది. నేను కూడా చెప్పాను. ఐతే నాకు ఆమెతో సెక్సులో పాల్గొనాలని కొన్ని రోజులుగా ఉన్నప్పటికీ ఎక్కడా ఆ విషయాన్ని ఆమెతో చెప్పలేదు. ఒకవేళ అడిగితే ఏం జరుగుతుందోనని భయంగా కూడా ఉంది...!!

 
మీ ఇద్దరికీ వివాహమై ఎవరి సంసారం వారు గడుపుతున్నారు. ఏదో స్నేహం కొద్దీ ఆమె తన దాంపత్య జీవితం విషయాల గురించి చెప్పి ఉండవచ్చు. అంతమాత్రం చేత ఆమెతో సెక్స్ కోర్కె తీర్చుకోవాలని కోరుకోవడం చాలా తప్పు. ఆమె నుంచి అలాంటి సుఖాన్ని కావాలనే ఆలోచనకు స్వస్తి చెప్పి స్నేహంగా మాత్రమే ఉండండి.