బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By Selvi
Last Updated : శనివారం, 7 నవంబరు 2015 (17:42 IST)

శృంగారంలో పాల్గొనండి.. పదికాలాల పాటు హాయిగా ఉండండి!

శృంగారంలో పాల్గొనండి.. పదికాలాల పాటు హాయిగా జీవించండి అంటున్నారు.. రియో గ్రాండే ఫెడరల్ వర్శిటీకి చెందిన పరిశోధకులు. తాజా అధ్యయనంలో తేలిందేమిటంటే.. శృంగారంలో పాల్గొనడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ఆస్కారాన్ని చాలామటుకు తగ్గించవచ్చునని పరిశోధకులు అంటున్నారు. గుండెపోటుకు మంచి ఉపశమనం శృంగారమేనని వారు తేల్చి చెప్తున్నారు. 
 
ఇంకా దంపతులిద్దరికీ గుండెపోటు వుంటే.. రోజూ శృంగారంలో పాల్గొనడం ద్వారా గుండెపోటును నియంత్రించుకోవచ్చునని రియో గ్రాండే ఫెడరల్ వర్సిటీకి చెందిన ప్రముఖ రచయిత రికార్డో స్టెయిన్ వెల్లడించారు. గుండెపోటుతో బాధపడుతున్న దంపతులపై నిర్వహించిన ఈ పరిశోధనలో వివిధ వ్యాయామాలు చేయడం కంటే.. శృంగారంలో పాల్గొనే దంపతుల్లో గుండెపోటుకు ఉపశమనం లభించినట్లు వెల్లడైందని పరిశోధకులు వెల్లడించారు.