శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : సోమవారం, 29 డిశెంబరు 2014 (19:18 IST)

నా భర్త వారాంతంలోనే సెక్స్ చేస్తారు.. స్నేహితురాలు వైబ్రేటర్ ఇచ్చింది.. ఎలా వాడాలి?

మేం హైదరాబాద్‌లో ఉంటున్నాం. నా భర్త ఉద్యోగ రీత్యా వారంలో రెండు రోజులు మాత్రమే ఇంట్లో ఉంటారు. అదీ కూడా వీకెండ్‌లోనే. ఆ సమయంలో బంధువుల రాకపోకలతో హడావుడిగా ఉంటారు. పైగా.. ఆ రెండు రోజుల్లో మాత్రం సెక్స్‌లో పాల్గొంటాం. కానీ, నాకు సెక్స్ కోర్కెలు ఎక్కువ. నా పరిస్థితిని అర్థం చేసుకున్న నా స్నేహితురాలు ఒకరు వైబ్రేటర్ ఇచ్చి వినియోగం గురించి వివరించింది. అయితే, దాన్ని ఎలా ఉపయోగించాలో చెప్పలేదు. పైగా.. ఈ వైబ్రేటర్ వల్ల నా కోర్కెలు తీరుతాయా? వైబ్రేటర్‌ను వినియోగించడం వల్ల యోని రంధ్రానికి ఎలాంటి హాని కలగదు కదా? సలహా ఇవ్వండి. 
 
చాలా మంది స్త్రీలు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. నిజం చెప్పాలంటే.. పరాయి పురుషులతో సంబంధాలు పెట్టుకోకుండా, స్వయంతృప్తి నిమిత్తం కోసం వాడే క్షేమకరమైన పరికరం వైబ్రేటర్. దీన్ని ఉపయోగించేందుకు చిన్నపాటి మెళకువలు, జాగ్రత్తలు పాటిస్తే చాలు. ముందుగా.. చేతులను పరిశుభ్రంగా వాష్ చేసుకోవాలి. అలాగే, చేతిగోళ్ళను బాగా ట్రిమ్ చేసుకోవాలి. 
 
ఆ తర్వాత వైబ్రేటర్ సాయంతో యోని పెదవులు ఉత్తేజం పొందేలా వినియోగించాలి. అలాగే, యోని రంధ్రంతోపాటు... యోని పెదవులపై కూడా ప్రభావం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పైగా... తమకు కావాల్సిన విధంగా వినియోగించుకోవడం వల్ల అమితానందం పొందవచ్చు. వైబ్రేటర్‌ను యోనిలో పెట్టుకున్న తర్వాత బాగా అదుముకోవడం లేదా హెచ్చుతగ్గుల వేగంతో వినియోగించడం వల్ల సహజరతి అనుభూతిని పొందవచ్చు.