శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : శనివారం, 31 జనవరి 2015 (22:14 IST)

నా మాజీ ప్రియురాలికి ఆ సుఖం నా నుంచి కావాలట ఏం చేయాలి?

నా కాలేజీ రోజుల్లో నాకో గర్ల్ ఫ్రెండ్ ఉండేది. మా ఇద్దరి పరిచయం నాలుగేళ్ళ పాటు కొనసాగింది. ఆమె కుటుంబ పెద్దల కారణంగా మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే, ఇటీవల నాకు ఫోన్ చేసి తన బాధను చెప్పుకుంది. పనిలోపనిగా భర్తతో ఎలాంటి సుఖం పొందలేకపోతున్నానని, కనీసం నా కోర్కెలను కూడా అర్థం చేసుకోవడం లేదంటూ బోరున విలపిస్తూ... తనకు మళ్లీ ఆ సుఖం ఇవ్వాలని కోరుతోంది. 
 
అయితే, నాకు కూడా వివాహమైందని, నా భార్యను అమితంగా ప్రేమిస్తున్నట్టు చెప్పాను. అయినా పట్టించుకోవడం లేదు. ఈ మధ్య వచ్చిన భార్య కంటే ముందు నాతోనే శారీరకంగా కలిశావని, అందువల్ల సర్వ హక్కులు తనకే సొంతమని వాదిస్తోంది. పైగా ముఖ్యంగా తన నుంచి శారీరక సుఖం కావాలని పరితపిస్తున్నట్టు చెప్పింది. పైగా, ఆమె భర్తకు వయస్సు 40 యేళ్లు అని, కనీసం స్నేహితుడిగా కూడా నడుచుకోవడం లేదని చెపుతోంది. నాకు ఏమని సమాధానం ఇవ్వాలో అర్థం కావడం లేదు.... 
 
మీ పట్ల నిజమైన ప్రేమ ఉన్నట్టయితే, అపుడే కుటుంబ పెద్దలను ఎదిరించి మిమ్మలనే వివాహం చేసుకుని వుండేది. కానీ, కొన్ని నెలల పాటు భర్తతో కాపురం చేసిన తర్వాత.. అక్కడ దాంపత్య సుఖం దక్కక పోవడం వల్లే మాజీ ప్రియుడు గుర్తుకు వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తోంది. పైగా మీకు వివాహమై భార్య ఉన్నారు. మాజీ ప్రియురాలి కోర్కెను మన్నిస్తే కట్టుకున్న భార్యకు ద్రోహం చేసినవారవుతారు. పైగా.. ఆమె మీ నుంచి కేవలం శారీరక సుఖాన్ని మాత్రమే కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. అందువల్ల వీలైనంత దూరంగా ఉండటం మంచిది. వివాహేతర సంబంధాలు ఏమాత్రం మంచివి కావు.