బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : శుక్రవారం, 23 జనవరి 2015 (17:19 IST)

ఆమె భూస్వామి భార్య... నో చెప్పగానే రేప్ కేసు పెడతానని బెదిరిస్తోంది.. ఏం చేయాలి?

నా వయస్సు 26 యేళ్లు. మా ఊరిలో ఉండే భూస్వామి భార్య చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమెకు వయస్సు 38 యేళ్లు ఉండొచ్చు. ఆమెను చూసి ఆకర్షితుడిని కావడంతో మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల తర్వాత నేను సెక్స్ ప్రతిపాదన చేయగా, ఆమె సమ్మతించింది. ఆ మరుసటి రోజు నుంచి ప్రతి రోజూ శారీరకంగా కలుసుకునేవాళ్లం. ఆమె భర్త ఉన్నప్పటికీ.. ఆయన స్లీపింగ్ పిల్స్ తీసుకుని నిద్రపోయేవారు. దీంతో మేమిద్దరం ఆమె ఇంట్లోనే వేకువజాము వరకు ఎంజాయ్ చేసేవాళ్ళం. అయితే, ప్రతి రోజూ సెక్స్ ఎందుకు కావాలని కోరుకుంటుందో నాకు అర్థమయ్యేది కాదు. ఒక రోజున నేను ఇంటికి రానని, ఇకపై నీతో సెక్స్‌లో పాల్గొనని చెప్పాను. దీంతో ఆగ్రహించిన ఆమె.. ప్రతి రోజూ తనను సుఖపెట్టకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, రేప్ కేసు పెట్టి జైలు ఊసలు లెక్కిస్తానని బెదిరించింది. దీంతో నేను వేరే ఉద్యోగం చూసుకుని మా ఊరు విడిచి వెళ్లిపోయా. అయితే, నా స్నేహితుల ద్వారా ఆఫీసు చిరునామా తెలుసుకుని అక్కడకు వచ్చి వేధిస్తోంది. ఏం చేయాలి. ఆమెను విడిపించుకోవడమెలా? సలహా ఇవ్వండి. ప్లీజ్. 
 
అందుకే వివాహేతర సంబంధాలు ఏమాత్రం శ్రేయస్కరం కాదని మన పెద్దలు పదేపదే చెప్పింది. ఇక్కడ భర్త ద్వారా ఆమె రతి సుఖాన్ని పొందడం లేదని తెలుస్తోంది. పైగా ఆమె కంటే చిన్నవాడితో సెక్స్ సుఖం అనుభూతిని అనుభవించడమే కాకుండా, ప్రతి రోజూ క్రమం తప్పకుండా భర్త ఇంటిలో పెట్టుకుని పడక సుఖం పొందుతూ వచ్చింది. ఉన్నట్టుండి ఆ సుఖం ఇక ఉండదని ఊహించుకుని ఆ విధంగా ప్రవర్తిస్తునట్టుగా ఉంది. ఏమైనా ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. ఆమె వివాహిత. పైగా భూస్వామి భార్య కావడం ధనవంతురాలు అయివుంటుంది. ఆమె చెప్పినట్టు విననిపక్షంలో ఆగ్రహించి అనుకున్నంత పని చేసినా చేయొచ్చు. అందువల్ల జాగ్రత్త నడుచుకుంటూ.. ఆమెతోనే ప్రశాంత వాతావరణంలో మాట్లాడి సమస్యకు పరిష్కారం కనుక్కోండి. మరో ఊరికి బదిలీ అయ్యానని తరచుగా కలవలేనని చెప్పి... దూరమయ్యేందుకు ప్రయత్నించండి. కోర్కెలు తీర్చుకునేందుకు మరో వ్యక్తిని చూసుకోమని ఆమె కోపగించుకోని విధంగా సలహా ఇవ్వండి. ఏది చేసినా ఆమెకు ఆగ్రహం కలిగించకుండా ఉండేలా చూసుకోండి. రేప్ కేసులో ఇరికిస్తే భవిష్యత్ అంధకారంగా మారుతుంది. తస్మాత్ జాగ్రత్త.