శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : సోమవారం, 19 జనవరి 2015 (16:35 IST)

నా భార్యతో సెక్స్‌లో పాల్గొనడం కంటే.. పరాయి స్త్రీలంటే మహాయిష్టంగా ఉంది... ఎందుకని?

నా వయస్సు 38 యేళ్లు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత 15 యేళ్ల సంసార జీవితంలో ఎలాంటి లోటుపాట్లు లేవు. కానీ, పడక గది జీవితంలో మాత్రం నాకు అసంతృప్తి ఉంది. ఫలితంగా ప్రతి రోజూ స్వయంతృప్తి పొందుతున్నాను. ఒక్కో రోజు ఇది రెండు మూడుసార్లు కూడా చేసుకునేవాడిని. అలాగే, పోర్న్ ఫిల్మ్స్ చూడటమంటే చాలా ఇష్టం. అయితే, గత కొన్ని నెలలుగా నా భార్యతో సెక్స్‌లో పాల్గొనాలంటే అయిష్టంగా ఉంది. ఇతర మహిళలపై మోజుపుడుతోంది. దీంతో వారంలో కనీసం ఒక్కసారైనా కాల్‌గర్ల్స్‌ వద్దకు వెళుతున్నారు. ఇది చెడు అలవాటు అని తెలిసినప్పటికీ.. భార్య కంటే పరాయి స్త్రీ అంటేనే ఇష్టంగా ఉంది. నా వైఖరి మార్చుకోవాలంటే ఏం చేయాలి.
 
ఇదో రకం మనస్తత్వం. ఆ మనస్తత్వమే శృంగార జీవితంలో కొత్త కొత్త రుచుల కోసం అన్వేషిస్తోంది. ఉవ్విళ్లూరుతోంది. ఫలితంగా భార్య వైపు నుంచి పరిపూర్ణమైన సహకారం లభిస్తున్నప్పటికీ దాన్ని కాదనీ ఇతర స్త్రీలపై మోజు పడుతున్నారు. అంటే భార్య, కటుంబం, పిల్లలు కంటే వ్యక్తిగత ఎంజాయ్‌మెంట్‌కే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారనే విషయాన్ని కూడా విస్మరించారు. పైగా... కట్టుకున్న భార్య పట్ల పూర్తిగా అశ్రద్ధ చూపుతున్నారు. హస్త ప్రయోగం అనేది చాలా మంది పురుషుల్లో ఉండే అలవాటు. దీనివల్ల ఎవరికీ ఎలాంటి హాని జరగదు. 
 
అయితే, 38 యేళ్ల వయస్సులో కూడా రోజుకు రెండు, మూడు సార్లు హ.ప్ర చేస్తున్నారంటే.. మీరు చేసే పనికంటే ఆ ధ్యాసే ఎక్కువగా ఉంది. పైగా, మీకు కలిగే కోర్కెలను తీర్చుకునేందుకు కాల్‌గర్ల్స్‌ వద్దకు వెళ్లడం వల్ల దాంపత్య సుఖం లభించదు. ఇలాంటి సంబంధాల వల్ల సుఖవ్యాధులతో పాటు.. ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల దాంపత్య సుఖాన్ని కట్టుకున్న భార్య వద్దే పొందేందుకు ప్రయత్నించండి. కుటుంబం, భార్య, పిల్లలను గుర్తుకు తెచ్చుకుని ముందుకు సాగినట్టయితే అన్ని సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుంది.