శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : బుధవారం, 24 జూన్ 2015 (13:15 IST)

నాకు పెళ్లైంది... నా కొలీగ్ పెళ్లికి ముందు సెక్స్ కావాలంటోంది.. ఏం చేయాలి?

నా వయస్సు 27 యేళ్లు. బెంగుళూరులో నివశిస్తున్నా. యేడాది క్రితం వివాహమైంది. అయితే, నేను గత ఐదేళ్ళుగా ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నా. నాకు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వీరిలో ఒకరికి వివాహమైంది. మరొకరికి కాలేదు. మేం ముగ్గురం మంచి స్నేహితులం కావడంతో మా జీవితాల్లో జరిగే ప్రతి విషయాన్ని చర్చించుకుంటాం. ఇటీవల నాకు, వివాహిత మహిళకు మధ్య వ్యక్తిగత పడగ గది శృంగారం ప్రస్తావనకు వచ్చింది. ఆ సమయంలో అవివాహిత యువతి మా వద్దకు వచ్చి.. పెళ్లికి ముందు సెక్స్‌ సుఖాన్ని అనుభవించాలని ఉందని చెపుతూనే.. తొలి కలయిక వల్ల కలిగే యోని కండరాలు నొప్పి, రక్తస్రావంపై భయం వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఒకరోజున వారిద్దరు నా వద్దకు వచ్చిన ముగ్గురం కలిసి సెక్స్‌లో పాల్గొందామని ప్రతిపాదించారు. ఒక రోజు తర్వాత వారి ప్రతిపాదనకు ఒకే చెప్పాను. అయితే, ఇపుడు నా మనస్సును ఓ సందేహం వెంటాడుతోంది. వివాహానికి ముందు తర్వాత ఇతరులతో సంబంధం లేని నేను.. ఇపుడు వీరితో సెక్స్‌లో పాల్గొంటే నా భార్యకు ద్రోహం చేసినట్టే కదా. పైగా నా భార్యతో సెక్స్‌లో పాల్గొనే సమయంలో కండోమ్‌ను ఉపయోగించను. అలాగే, వీరితో కూడా సెక్స్‌లో పాల్గొనేటపుడు కండోమ్ ఉపయోగించకూడదన్నదే నా నిర్ణయం. అందువల్ల వారితో సెక్స్‌లో పాల్గొంటే నేను అనుసరించాల్సిన రక్షణ చర్యలేంటి.. వారిని సంతృప్తి పరిచేందుకు ఉత్తమమైన భంగిమలేంటి? సలహా ఇవ్వండి. ప్లీజ్. 
 
మీ మనస్సులో ఒకటి పెట్టుకుని బయటకు మరొకటి చెపుతున్నారు. ఒకవైపు.. ఏకపత్నీవ్రతుడినని చెపుతూనే.. ఇపుడు ఏకంగా ఇద్దరు మహిళలతో కలిసి ఒకేసారి సెక్స్‌లో పాల్గొనాలని, ఇందుకు సలహాలు ఇవ్వమని అడుగుతున్నావు. ఇది ఏమాత్రం.. మీ ముగ్గురికి క్షేమం కాదు. పైగా.. కండోమ్ ధరించకుండానే వారితో సెక్స్‌లో పాల్గొనాలన్నది మీ కోర్కెగా ఉంది. ఒకవేళ మీ ముగ్గురి ఏ ఒక్కరికీ సుఖవ్యాధులు ఉన్నా.. ముగ్గురితోపాటు.. మీ భార్యకు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. ఇక్కడో విషయం గుర్తించాలి. అవివాహిత యువతితో కండోమ్ లేకుండా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఆమెకు గర్భం వస్తే ఏం చేస్తారు.? ఈ విషయం మీ భార్యకు తెలిస్తే మీ పరిస్థితి ఏంటి? అందువల్ల ఆ మహిళల ప్రతిపాదనను నిర్ద్వంద్వగా తోసిపుచ్చండి. వారితో ఎంజాయ్ చేసేందుకు కొత్త భంగిమల కోసం అన్వేషించకండి.