బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : శుక్రవారం, 17 అక్టోబరు 2014 (20:55 IST)

నా వయస్సు 18 యేళ్లు.. ఆమె వయస్సు 32... నన్ను కోరుకుంటోంది.. ఏం చేయాలి?

నా వయస్సు 18 యేళ్లు. అమెరికాలో నివశిస్తున్నాం. మా అమ్మ ఓ ప్రొఫెషనల్ కౌన్సిలర్. ఆమె స్నేహితురాలు ఒకరు అమ్మ వద్ద కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు. ఒక రోజున అమ్మ ఇంట్లో ఫోన్ మరచిపోయింది. ఆ సమయంలో ఫోన్ రావడంతో నేను అటెండ్ చేయగా, మా సమీప బంధువు. ఆమె వయస్సు 32 యేళ్లు. తొలుత సహజంగానే మాట్లాడిన ఆమె.. ఆ తర్వాత మాటల్లో శృతిమించిపోయింది. నా కళ్లు, అందాలు, శరీర సౌష్టవం. ఫిజకల్ బాడీ, సెక్సీనెస్, తెలివితేటల గురించి వర్ణిస్తూ.. నన్ను ఇష్టపడుతున్నట్టు చెప్పి.. నా ద్వారా శారీరక సుఖాన్ని కోరుకుంటున్నట్టు చెప్పడంతో నేను షాక్‌కు గురయ్యాను. ఆ తర్వాత నుంచి నేరుగా నా మొబైల్‌కు ఫోన్ చేసి మాట్లాడుతోంది. ఆమెను అవైడ్ చేయలేక పోతున్నా. ఎందుకంటే బంధువు కావడంతో మొహమాటం అడ్డొస్తోంది. పైగా నా వయస్సు 18 యేళ్లు. ఆమె వయస్సు 32 యేళ్లు. ఇద్దరికీ ఎలాంటి పొంతన ఉండదు. ఏం చేయాలి సలహా ఇవ్వండి. 
 
పైన పేర్కొన్న వివరాల మేరకు ఆమె బై పోలార్ డిజార్డర్ సమస్యతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అంటే, డిప్రెషన్, మానియాతో బాధపడటాన్ని బై పోలార్ డిసార్డర్ అంటారు. తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న వారు పూర్తిగా నిగ్రహాన్ని కోల్పోతారు. ఇక్కడ ఆమె విషయంలో ఇదే జరిగినట్టుగా ఉంది. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే సైకాలజీ కౌన్సిలర్ కంటే.. ప్రొఫెషనల్ మెడికల్ సైక్రియాట్రిస్ట్ వద్ద ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. పైగా మెడిటేషన్ ఎంతో ముఖ్యం. కేవలం కౌన్సిలింగ్‌కు ఈ సమస్యకు పరిష్కారం లభించదు. 
 
ప్రస్తుతం నీవు ఎదుర్కొంటున్న పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెతో మాట్లాడటం మానేస్తే ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడే అవకాశం లేకపోలేదు. అందువల్ల ఆమెతో మాట్లాడుతూనే.. ఈ విషయాన్ని ఇంట్లోని పెద్దలకు దృష్టికి తీసుకెళ్ళి, వారి ద్వారా ఆమెను దారికి తెచ్చుకోవడం సరైన మార్గం. లేదంటే నీ ఈ సమస్య నీ తలకు చుట్టుకునే ప్రమాదం లేకపోలేదు.