గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By IVR
Last Modified: శుక్రవారం, 11 జులై 2014 (15:13 IST)

సెక్స్ పూర్తయ్యాక నేను పడుకుంటాను... ఆమె పరుగెడుతోంది... ఎందుకిలా?

నాది అసలు సమస్యో కాదో తెలియడంలేదు. మా ఆవిడకు విపరీతమైన శుభ్రత. రోజుకు కనీసం 4 సార్లు స్నానం చేస్తుంది. ఎప్పుడు కౌగలించుకుందామన్నా, వళ్లు బాగోలేదు వద్దని వారిస్తుంది. అదంతా రాత్రిపూట స్నానం చేశాక మాత్రమే అంటుంది. ఎలాగో రాత్రి అయ్యాక సెక్స్ ముగిసిన తర్వాత మర్మావయవాలను శుభ్రం చేసుకోవాలని అంటుంది. నాకేమో వీర్య స్ఖలనం ముగించాక కొద్దిసేపు అలా పడుకోవాలనిపిస్తుంది. ఆమె మాత్రం వీర్యం స్ఖలించిన వెంటనే బాత్రూంకు పరుగెడుతుంది. శుభ్రం చేసుకోవడమే కాదు... స్నానం కూడా చేస్తుంది. మరీ అంత అవసరమా...?
 
సెక్స్ ముగిశాక మర్మావయవాలను శుభ్రం చేసుకోవడం ఆరోగ్యమే. కానీ శుభ్రత పేరుతో మరీ అన్నేసి సార్లు అంటే, సెక్సుకు ముందు సెక్సుకు తర్వాత ప్రతిసారీ చేయక్కర్లేదు. సెక్స్ అయ్యాక మర్మావయవాలను శుభ్రం చేసుకోవడం మంచిది. మీరు బద్ధకంగా పడుకుంటానని చెపుతున్నారు. ఐతే శుభ్రం చేసుకున్న తర్వాతనే విశ్రమించాలి. అలాగని సెక్స్ ముగిసిన వెంటనే పరుగెట్టాల్సిన అవసరం లేదు. మీ భార్య విషయంలోనూ... ఆమె వీర్యస్ఖలనం ముగిసిన వెంటనే అలా శుభ్రం చేసేసుకుంటే సంతానం కలిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కనుక సంతానం కావాలనుకునే స్త్రీలు సెక్స్ పూర్తయ్యాక కొద్దిసేపు పడుకున్న తర్వాతనే శుభ్రత పాటించాలి.