బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PY REDDY
Last Updated : గురువారం, 18 డిశెంబరు 2014 (17:08 IST)

83కిలోల బరువున్నా... సెక్స్ కు పనికిరానా.. ఏం చేయాలి

నా వయసు 21 యేళ్ళు. నా బరువు 83 కిలోలు. ఎత్తు 5.10 అడుగులు. నాకింకా పెళ్ళికాలేదు.  చదువులో ఉన్న ఒత్తిడి కారణంగా బిపి వచ్చింది. నా గర్ల్ తో ఓ సారి సెక్స్ లో పాల్గొన్నా కానీ  సంతృప్తిపరచలేకపోయా.. 15 నిమిషాల తరువాత మళ్ళీ ప్రయత్నం చేశా.. మునుపటి కంటే అద్వాన్నంగా చేశా.. అయితే ఆమె ప్రస్తుతం మళ్ళీ ఒక సారి సెక్స్ లో పాల్గొందామని చెబుతోంది. అంగస్తంభన సరిగా కాకపోవడంతో జంకుతున్నాను. అక్కడికి బరువు తగ్గడానికి నడక ప్రారంభించా, ఆహార నియమాలు పాటిస్తున్నా.. బిపి మామూలు స్థాయికి వస్తోంది. నేను సెక్సులో సమర్థవంతంగా పాల్గొనాలంటే ఇంకా ఏం చేయాలి?
 
మొట్టమొదట మీకు చెప్పదలుచుకున్నది పెళ్లికి ముందు సెక్స్‌లో పాల్గొనడం మంచిది కాదు. వయసు రీత్యా మీకు ఎటువంటి లైంగిక సమస్యలు ఉండే అవకాశం లేదు. కేవలం బరువే మిమ్మల్ని వేధిస్తోంది. ఇప్పటికే బరువు తగ్గేందుకు మీరు ప్రయత్నాలు మొదలు పెట్టారు. కాని నడక ఒక్కటే సరిపోదు. యోగా కూడా ఉండాలి. శరీరంలోని నీరు, కొవ్వు శాతాన్ని తగ్గించే పదార్థాలు తీసుకోవాలి. జ్యూస్, పండ్లు వంటివి తీసుకోవాలి. వ్యాయమం చేయాలి. అప్పుడే బరువు తగ్గుతారు. బిపి తగ్గించుకోవడానికి ఉప్పు తగ్గించాలి. ఇక సెక్స్ అంటారా. మీ శరీర బరువు తగ్గితే ఆ సమస్య కూడా దానంతట అదే దారికి వస్తుంది. భయపడాల్సిన పని లేదు. పెళ్లయ్యాక ప్రయత్నాలు చేయండి.