మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : బుధవారం, 22 ఏప్రియల్ 2015 (15:31 IST)

నా యోని పెద్దది.. మావారి పురుషాగం చిన్నది.. భయంతో చెంతకు రావడం లేదు.. ఎలా?

మాది గుంటూరు. యేడాది క్రితం వివామైంది. మేమిద్దరం దాంపత్య జీవితాన్ని ఇప్పటి వరకు సంతృప్తిగా ఎంజాయ్ చేసిన క్షణాలు లేవు. దీనికి కారణం లేకపోలేదు. నా యోని పెద్దదిగా ఉంటుంది. మా వారి అంగం చిన్నదిగా ఉంటుంది. ఫలితంగా నన్ను సంతృప్తిపరచలేననే భయంతో నా వద్దకు వచ్చేందుకు భయపడుతున్నారు. అంగం సైజు గురించి నేనేమీ పట్టించుకోవడం లేదనీ, పైగా.. సెక్స్ చేసినంత వరకు తృప్తిగానే ఉందని చెప్పినా ఆయన వినిపించుకోవడం లేదు. ఏం చేయాలి. ఒక్కోసారి.. అంగం చిన్నదిగా ఉందని బెంగ పెట్టుకోవడం వల్ల అంగ స్తంభన కూడా నామమాత్రంగానే అవుతుంది. మా సమస్యకు పరిష్కారమేంటి. అంగం సైజు పెరిగేందుకు ఏదైనా మార్గాలు ఉన్నాయా? 
 
దాంపత్యంలో పాల్గొనే స్త్రీపురుషులు.. ఒకరినొకరు సహకరించుకుంటూ.. చర్చించుకుంటూ ముందుకు సాగినట్టయితే ఎలాంటి అసంతృప్తులు ఉండవు. అదేసమయంలో భర్త పరిస్థితిని అర్థం చేసుకుని, ఆయనను ప్రోత్సహిస్తూ ముందుకు సాగడమనేది చాలా అభినందనీయమైన విషయం. 
 
సాధారణంగా అంగ పరిమాణాన్ని బట్టి వారు స్త్రీని సుఖపెట్టే అంశం ఆధారపడివుంటుందని భావిస్తుంటారు. ఈ తరహా భావన ఉన్న పురుషులు సంఖ్య చాలా ఎక్కువ. ఇలాంటి ఆలోచనలు ఉన్న పురుషులను వెనక్కి తీసుకుని రావడం అంత సులభమైన విషయం కాదు. 
 
ముఖ్యంగా శృంగారంలో పాల్గొనే స్త్రీని కేవలం పురుషుడు తన అంగంతోనే తృప్తి పరచాలన్న నిబంధనేదీ లేదు. స్త్రీ శరీరంలోని అనే భాగాలను స్పర్శిస్తుంటే వారిలో కలిగే ఆనందం, తృప్తీ అంతాఇంతా కాదు. దీనికితోడు.. ఓరల్ సెక్స‌లోనూ పాల్గొనవచ్చు. ఓరల్ సెక్స్‌లో పాల్గొనడం వల్ల స్త్రీపురుషులిద్దరూ పూర్తి సంతృప్తిని పొందొచ్చు. 
 
అంతేకానీ, అంగం సైజును పెంచుకునేందుకు మార్కెట్‌లో ఎలాంటి మందులు లేవు. అలాంటి ప్రకటనలు చేసేవన్నీ కేవలం బూటకం మాత్రమే. డబ్బులు గుంజుకునేందుకు చేసే ప్రయత్నాలు. వీటిని చూసి మోసపోకండి. అలాగే, యోని పెద్దదిగా ఉన్నట్టయితే అంగ ప్రవేశ సమయంలో యోని కండరాలు బిగబట్టినట్టయితే, యోని వ్యాసం తగ్గేందుకు ఆస్కారం ఉంది. ఆ సమయంలో అంగ ప్రవేశం చేసినట్టయితే, యోని బిగుతుగా ఉందనే ఫీలింగ్ పురుషుని కలిగి సంతృప్తి పొందేందుకు ఆస్కారం ఉంటుంది.