శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : బుధవారం, 21 జనవరి 2015 (17:32 IST)

నా భర్త నిద్రించే సమయంలో అక్కడ అలా చేస్తారు... ఇదేమైనా జబ్బా?

నా వయస్సు 26 యేళ్లు. ఆర్నెల్ల క్రితం వివాహమైంది. దాంపత్య జీవితంలో ఎలాంటి లోటూ లేదు. మేమిద్దరం ఒకరినొకరు అమితంగా ఇష్టపడుతాం. అలాగే, శృంగారంలోనూ పాల్గొంటాం. అయితే, నేనో వింత సమస్యను నా భర్త ద్వారా ఎదుర్కొంటున్నా. అదేంటంటే... సెక్స్‌కు ముందు లేదా సెక్స్ తర్వాత నా భర్త నా పిరుదులపై ముద్దులు పెట్టి వాసన చూస్తుంటారు. నేను నిద్రపోతున్న సమయంలో కూడా ఆయన అదేపని చేస్తున్నారు. ఒక రోజున నా ప్యాంటీ విప్పి బాత్రూంలో తగిలించా. దాన్ని కూడా అతను వాసన చూస్తుండటం గమనించా. ఫోర్‌ప్లే సమయంలోనేకాకుండా, సాధారణ సమయాల్లో కూడా అతను నా వెనుక చేరి ఇదే పని చేస్తుంటారు. ఇదేవిధంగా అనేకసార్లు చేశారు. ఇదేం పని అడిగితే.. స్త్రీ పిరుదుల వాసన చాలా బాగుంటుందని అన్నాడు. ప్రతి పురుషుడికి ఈ తరహా అలవాటు ఉంటుందా? పెళ్లికి ముందు అతని ప్రవర్తన గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. నేను నా భర్తను ప్రోత్సహించవచ్చా. ఒక వేళ ప్రోత్సహిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి. 
 
సాధారణంగా చాలా మంది పురుషులు స్త్రీలోని ప్రతి భాగాన్ని అమితంగా ఇష్టపడుతారు. వాటిలో తమకు బాగా నచ్చిన భాగాన్ని నాలుకతో చుంబించడం, కొరకడం వంటివి చేస్తుంటారు. అయితే, ఆయన విషయంలో విపరీతంగా ఉంది. బాత్రూంలోని ప్యాంటీలు వంటివి వాసన చూడటం అనేది అసాధారణ చర్య. వద్దనుకుంటే మాత్రం దాంపత్య జీవితం చెడిపోకుండా భర్తకు కౌన్సిలింగ్ ఇప్పించండి.