శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : గురువారం, 29 జనవరి 2015 (11:44 IST)

శృంగారంలో మజాను ఆస్వాదించాలంటే ఒత్తిడికి దూరంగా ఉండాలి!

ప్రస్తుతం ప్రతి వ్యక్తి కాలంతో పోటీపడుతూ పరుగెడుతున్నాడు. ఫలితంగా తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. దీంతో రాత్రి ఇంటికి వచ్చే సరికి భార్యా భర్తలిద్దరూ బెడ్‌పై అటువైపు ఒకరు, ఇటు వైపు మరొకరు తిరిగి పడుకుంటారు. ఫలితంగా వారు ఎలాంటి సుఖ సంతోషాలు లేని దాంపత్య జీవితాన్ని సాగిస్తున్నారు. ఇలాంటి వాటికి ధ్యానం ద్వారా చెక్ పెట్టేందుకు కృషిచేయాలి. 
 
అలాగే, వివాహమైన కొత్తల్లో రోజుకు నాలుగైదు సార్లు సెక్స్ చేస్తుంటారు. నెలలు గడిచే కొద్దీ సెక్స్‌పై కోర్కెలు సన్నిగిల్లుతుంటాయి. అయితే, స్త్రీ పురుషుల్లో సెక్స్ కోర్కెలు కొన్నిసార్లు ఉవ్వెత్తున ఎగసిపడటం, మరికొన్నిసార్లు తక్కువగా ఉండటం సహజమే. 
 
అంతమాత్రాన తమలో సెక్స్ సామర్థ్యం పూర్తిగా నశించిపోయిందని ఆందోళన చెందకూడదని సెక్స్ నిపుణులు. సాధారణంగా సెక్స్ కోర్కెలనేవి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయన్నది వారి వాదనగా ఉంది. వంశపారంపర్య లక్షణంగా, శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు, వయస్సు, తగిన ఈడుజోడు, భార్యాభర్తల ప్రోత్సాహం కూడా ఎంతో కీలకం. 
 
అయితే, వీటన్నింటికి దూరంగా ఉండటం సాధ్యపడక పోయినప్పటికీ.. సెక్స్ పవర్‌నిచ్చే పోషకాహారాలు తీసుకుంటే దాంపత్య జీవితాన్ని ఆనందంగా గడపవచ్చని సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అది ఎలా అంటే.. వివాహమైన తొలిరోజుల్లో రోజుకు మూడునాలుగు సార్లు సెక్స్‌లో పాల్గొన్న విధంగానే పాల్గొనవచ్చని వారు చెపుతున్నారు.