గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : శనివారం, 20 డిశెంబరు 2014 (14:56 IST)

యోనిలో రెండు రంధ్రాలు ఉంటాయి.. ఎందులో అంగ ప్రవేశం చేస్తావు అని ప్రశ్నిస్తున్నారు?

నా వయస్సు 24 యేళ్లు. ఇప్పటి వరకు ఏ స్త్రీ లేదా యువతితో సెక్స్‌లో పాల్గొనలేదు. కానీ స్నేహితులు మాత్రం పలువురు వేశ్యల వద్దకు వెళ్లి సెక్స్ ఎంజాయ్ చేస్తున్నారు. నన్నూ రమ్మని బలవంతం చేస్తున్నా నేను వెళ్లలేదు. అయితే, వారు ఇటీవల ఒక ప్రశ్న వేశారు. యోనిలో రెండు రంధ్రాలు ఉంటాయి.. అంగ ప్రవేశం ఎక్కడ చేస్తావు అని అడుగుతున్నారు. ఇలాంటి సందేహాలు తీరాలంటే ఖచ్చితంగా ముందస్తు అనుభవం ఉండి తీరాల్సిందేనని చెపుతున్నారు. ఏం చేయాలి. నా స్నేహితులు చెప్పేది నిజమా? నా సందేహం తీర్చండి ప్లీజ్. 
 
వారి మాటలు పచ్చి అబద్ధం. ఆ మాటలను పట్టించుకోవద్దు. ఇలాంటి విషయాలన్నీ వివాహమైన తర్వాత పడక గదిలోనే మీరే స్వయంగా తెలుసుకుంటారు. మీ వయస్సు, కోర్కెలే అన్ని విషయాలు తెలిసేలా చేస్తాయి. ఇక యోని రంధ్రాల విషయానికి వస్తే.. సాధారణంగా స్త్రీ మర్మావయవాల్లో ఒకదాని కింద ఒకటి రెండు రంధ్రాలు ఉంటాయి. అందులో మూత్రవిసర్జన చేసే రంధ్రం చాలా చిన్నదిగా ఉంటుంది. 
 
అందులోకి అంగ ప్రవేశం జరగనే జరగదు. మూత్ర విసర్జన రంధ్రం కిందే యోని ద్వారం ఉంటుంది. అందులోనే అంగ ప్రవేశం చేయాల్సి ఉంటుంది. పైగా పర స్త్రీలతో శృంగార సంబంధాలు అనేక సమస్యలకు దారితీస్తాయి. మీ స్నేహితుల ఒత్తిడికి లోనై తప్పుదారి పట్టొద్దు. వివాహమైన తర్వాత భార్య సహకారంతో మీ సందేహాలన్నింటికీ సమాధానం లభిస్తుంది.