శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : గురువారం, 25 జూన్ 2015 (19:03 IST)

నాలో సెక్స్ కోర్కెలు తక్కువ.. శృంగార కోర్కెలు పెంచే శాకాహార పదార్థాలేంటి?

నా వయస్సు 24 యేళ్లు. నేను త్వరలోనే వివాహం చేసుకోబోతున్నా. అయితే, నాకు చిన్నప్పటి నుంచి సె‌క్స్‌పరమైన అంశాలపై పెద్దగా ఆసక్తిలేదు. దీంతో నా దాంపత్య జీవితం ఎలా ఉంటుందోనన్న భయంపట్టుకుంది. పైగా నేను పూర్తి శాకాహారిని. ఇపుడు నా ప్రశ్న ఏంటంటే.. నాలో సెక్స్ కోర్కెలు పెరిగేలా దోహదపడే శాకాహార పదార్థాలు చెప్పండి. 
 
సెక్స్ కోర్కెలు అనేవి అనేక అంశాలపై ఆధారపడి కలుగుతాయి. శరీర స్వభావం, శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు, ఆరోగ్య స్థితి, తీసుకునే ఆహారం తదితర అంశాలపై ఆధారపడివుంటుంది. సాధారణంగా ఒక మనిషిలో కొన్ని సందర్భాల్లో అధికంగా కోర్కెలు కలగడం, మరికొన్ని సందర్భాల్లో తక్కువగా కోర్కెలు కలగడం సహజమే. 
 
అయితే, ఈ కోర్కెలు అనేవి సాధారణ స్థాయిలో ఎల్లవేళలా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం నిరంతరం తీసుకుంటుండాలి. ప్రత్యేకించి ఒక తరహా ఆహారపదార్థాలని కాకుండా, అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు తీసుకుంటూ ఉండాలి. అదేసమయంలో శృంగారంపై మనస్సు కేంద్రీకరించినట్టయితే, కోర్కెలు వాటంతట అవే కలుగుతాయి.