శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By chj
Last Modified: బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (19:47 IST)

గర్భం రావాలంటే ఇలా చేస్తే సరి...

సాధారణంగా పురుష వీర్యం మహిళల అండంతో ఫలదీకరణం చెందినప్పడు మహిళలు గర్భం పొందుతారు. అలాగే శృంగారం చేసే భంగిమలు కూడా గర్భం రావడానికి ముఖ్యమేనని గుర్తించాలి. శృంగారంలో రోజూ పాల్గొనడం వల్లే గర్భం రాదు. పురుష వీర్యకణాలు ఎక్కువ సమయం స్త్రీ జననేంద్రియంలో ఉండట

సాధారణంగా పురుష వీర్యం మహిళల అండంతో ఫలదీకరణం చెందినప్పడు మహిళలు గర్భం పొందుతారు. అలాగే శృంగారం చేసే భంగిమలు కూడా గర్భం రావడానికి ముఖ్యమేనని గుర్తించాలి. శృంగారంలో రోజూ పాల్గొనడం వల్లే గర్భం రాదు. పురుష వీర్యకణాలు ఎక్కువ సమయం స్త్రీ జననేంద్రియంలో ఉండటం వల్ల గర్భం దాల్చుతారు. అది కూడా మహిళలకు అండం విడుదలయ్యే సమయంలో గర్భం దాల్చుతారు. మహిళలకు నెలకు ఒకసారి మాత్రమే అండం విడుదలవుతుంది. అదే మగవారిలో వేలసంఖ్యలో ఒకసారి శుక్రకణాలు విడుదలవుతాయి. 
 
మామూలుగా మగవారి నుండి అండం లోకి విడుదలయిన శుక్రకణాలు అయిదు రోజుల వరకు ఉంటాయి. అదే మహిళల నుండి విడుదలయిన అండం 7 నుండి 12 గంటలు మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో శుక్రకణంతో అండం ఫలదీకరణం చెందినట్లయితే గర్భం వస్తుంది. అండంతో ఫలదీకరణం చెందిన తరువాత 10 గంటలలో పిండం ఏర్పడుతుంది. చాలామందిలో గర్భం రావడానికి శృంగారంలో ఎప్పుడు పాల్గొనాలి అన్న అనుమానం ఉంటుంది.
 
మహిళల్లో అండం విడుదలకు నాలుగు లేక అయిదు రోజులు ముందు కాని, అండం విడుదలకు ముందు రోజు సంభోగం చేయడం వల్ల గర్భాన్ని పొందవచ్చు. మహిళలకు అండం ఎప్పుడు విడుదలవుతుందో వారికి తెలిసే ఉంటుంది కాబట్టి ఆ సమయంలో సంభోగం చేస్తే సరిపోతుంది. అలాగే స్త్రీ జననేంద్రియం లోపల పురుష వీర్యం ఉండేలా శృంగార భంగిమలు పాటించాలి.