శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By CVR
Last Updated : బుధవారం, 10 డిశెంబరు 2014 (15:33 IST)

సెక్స్‌కు బెస్ట్... వేడి నీళ్ళ స్నానమా..? చన్నీటి స్నానమా...?!

శృంగార జీవితం బాగుండాలంటే వేడి నీళ్ళ స్నానం మంచిదా? చన్నీళ్ళ స్నానం మంచిదా?
 
స్త్రీ, పురుషుల్లో కామోద్రేకం పొందడం, అంగస్తంభనలు కలగడమనేది మనసులో కలిగే కోరిక, హార్మోన్ల ప్రభావానాన్ని బట్టి ఉంటుంది. వేడినీళ్ళతో స్నానం చేసినంత మాత్రాన లేదా చన్నీటితో స్నానం చేసినంత మాత్రాన కోరికలు ఏ మాత్రం కలగవు. 
 
సెక్స్ కోరికలు శరీరానికి చేసే స్నానాలతో ముడిపడవు. అవి మనస్సు, ఆలోచనలను బట్టే ఉంటాయి. సాధారణంగా వారి వారి శరీర తత్వం లేదా మొదటి నుండీ ఉన్న అలవాటునుబట్టి వేడి, లేదా చన్నీటి స్నానాలు చేస్తారు.
 
కాకపోతే చలికాలంలో దంపతులు వెచ్చదనం కోసం ఆరాటపడుతూ, కోరిక మూలంగా క్షణంలో ఉద్రేకంచెంది ఒకటవుతారు. అంతేకాని వేడి నీటితోనో, లేక చన్నీటితోనే స్నానం చేయడం వల్ల కాదు. కాకపోతే అవి ఏ నీళ్లైనా స్త్రీ, పురుషులు కలిసి స్నానం చేస్తే సెక్స్ కోరికలు తప్పకలు ఏర్పడతాయి. ఏదేమైనా శరీర శుభ్రత కోసం స్నానం చేయం తప్పనిసరి.