ద్రాక్ష, లవంగం వాసనలు మగవారిలో ఆ కోరికలను రేకెత్తిస్తాయట..

ద్రాక్ష, లవంగం వాసనలు మగవారిలో కోరికలను రేకెత్తిస్తాయని పరిశోధనలో తేలింది. ఈ ఫ్లేవర్ ఉన్న అత్తరును స్త్రీలు రాసుకుంటే పురుషులు వారి చుట్టే తిరుగుతారని చికాగోకు చెందిన ఓ యూనివర్శిటీ పరిశోధనలో వెల్లడి అ

lovers romance
Selvi| Last Updated: గురువారం, 29 డిశెంబరు 2016 (10:29 IST)
ద్రాక్ష, లవంగం వాసనలు మగవారిలో కోరికలను రేకెత్తిస్తాయని పరిశోధనలో తేలింది. ఈ ఫ్లేవర్ ఉన్న అత్తరును స్త్రీలు రాసుకుంటే పురుషులు వారి చుట్టే తిరుగుతారని చికాగోకు చెందిన ఓ యూనివర్శిటీ పరిశోధనలో వెల్లడి అయ్యింది. ఇంకా ఎరుపు రంగు ప్రేమకూ శృంగారానికీ చిహ్నం. ఆ దుస్తుల్లో ఉన్న మహిళల వైపు మగవారు ఆకర్షితులయ్యే అవకాశం చాలా ఎక్కువ.
గర్ల్‌ఫ్రెండ్‌ ఎర్రటి వస్త్రాలు ధరించి వచ్చినరోజు అబ్బాయిలు వారిని సంతోషంగా ఉంచేందుకు మిగతా రోజుల్లో కంటే ఎక్కువగా ఖర్చు పెడతారని కూడా చాలా పరిశోధనలో తేలింది. అలాగే ఆలూమగలు అన్యోన్యంగా ఉండాలంటే ఒకరినొకరు అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలి. ఆ అవగాహన లోపిస్తే దాంపత్య జీవితం నరకంగా మారుతుంది.

అయితే భార్యాభర్తలిద్దరిలో భర్త చాలా విషయాల్లో మొరటుగా ప్రవర్తిస్తున్నాడని సర్వేలో తేలింది. కానీ అర్థం చేసుకుని ముందుకెళ్తే.. దాంపత్య జీవితం సుఖమయమవుతుందని సైకలాజిస్టులు అంటున్నారు. మీ భాగస్వామి లేదా ప్రేయసిని వెంబడిస్తున్నట్లు కాకుండా వెన్నంటి ఉన్న భావాన్ని కలిగిస్తే.. ఆమెకు మీపట్ల గౌరవభావాలు పెంపొందుతాయి.


దీనిపై మరింత చదవండి :