మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : గురువారం, 31 జులై 2014 (16:47 IST)

నా భర్తతో నా చెల్లి చాలా చనువుగా ఉంటోంది.. నాకు భయంగా వుంది?

మాది విశాఖపట్నం. నా చెల్లికి ఇంకా వివాహం కాలేదు. ఆమె నా భర్తతో చాలా చనువుగా ఉంటోంది. అలా ఉండటం నాకు ఇష్టం లేదు. దానివల్ల నాకు నా భర్తకు మధ్య తగదాలు వస్తున్నాయి. నేను ఉన్నపుడు మాత్రం దూరంగా ఉంటారు. నేను లేనపుడు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నట్టు నాకు సందేహం కలుగుతోంది. ఇలాంటి ప్రవర్తన మధ్య నా భర్తకు, నా చెల్లికి మధ్య బంధం ఏర్పడితే నా పరిస్థితి ఏంటి. నా భర్తకు నేనంటే ప్రేమే. అయినప్పటికీ ఎక్కడో చిన్న జంకు ఉంది. అందువల్ల నా చెల్లిని మార్చడం ఎలా? సలహా ఇవ్వరు. 
 
నిజానికి మీరెంటే మీ భర్తకు మంచి ప్రేమ ఉందని చెపుతున్నారు. అలాంటపుడు మీకు సందేహం ఎందుకు. మీ మనస్సులో ఎముందో మీకు బాగా తెలుసు. ఇతర పురుషులు ప్రవర్తనను మీ భర్తకు మీరు ఎందుకు ఆపాదిస్తారు. ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరమే లేదు. వాస్తవికంగా ఆలోచన చేయండి. తెరచిన మనస్సుతో మీ చెల్లిని, భర్తను చూడటం ప్రారంభిస్తే మీ సమస్యకు పరిష్కారం లభించినట్టే.