బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : మంగళవారం, 28 అక్టోబరు 2014 (15:48 IST)

నా భార్యకు సెక్స్‌లో అతికోర్కెలు.. వాటిని తీర్చలేక పోతున్నా... ఎవరితోనైనా లేచిపోతుందా?

మాది గుంటూరు. వివాహమై ఐదేళ్లు అవుతోంది. నా భార్యకు సెక్స్ కోర్కెలు అధికం. ఎపుడు వీలు దొరికితే అపుడు సెక్స్ చేయమని పోడు చేస్తోంది. ఆమె కోర్కె తీర్చలేక చచ్చిపోతున్నా.. ఒక్కోసారి ఇంట్లో ఉండేందుకు సైతం భయపడుతున్నా. నా వైఖరి వల్ల ఆమె కోర్కెలు తీరక మరొకరితో లేచిపోతుందేమోనని భయమేస్తోంది. నేనేం చేయాలి. 
 
దాంపత్య జీవితంలో ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. వీటిని ధైర్యంగా ఎదుర్కొని తీరాల్సిందే. ముఖ్యంగా పడక గదిలో భార్యను సంతృప్తి పరిచేలా నడుచుకోండి. అలాగే, ఆమెకు వివరించి చెప్పండి. అదేసమయంలో ఆమెను సంతృప్తి పరచలేను అనే అపనమ్మకం మాత్రం మీ దరిచేరకుండా చూసుకోండి. మీలోనూ మంచి సెక్స్ సామర్థ్యం ఉందనే నమ్మకంతో ముందుకు సాగండి.
 
అదేసమయంలో పడక గదిలో నేరుగా సెక్స్‌లో పాల్గొనకుండా మీ భార్య రెచ్చిపోయేంత వరకు ఉపరతి (ఫోర్‌ప్లే)లో పాల్గొనండి. ఈ రతిలో మీ భార్య అంత్యదశకు చేరుకుందని భావించిన తరుణంలో అంగ ప్రవేశం చేసినట్టయితే మీ భార్యతోపాటు.. మీరు కూడా సంతృప్తి చెందుతారు.