శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: సోమవారం, 28 జులై 2014 (14:52 IST)

అంగ ప్రవేశ సమయంలో యోనిలో నొప్పికి కారణమేంటి?

సెక్సులో పాల్గొనే సమయంలో యోనిలో నొప్పి కలుగుతున్నట్టు చాలామంది స్త్రీలు చెబుతుంటారు. శృంగారంలో పాల్గొనాలనే కోరిక ఎక్కువగానే ఉన్నప్పటికీ తమ భాగస్వామి అంగ ప్రవేశం చేసిన తర్వాత ఈ నొప్పి ఎక్కువగా ఉంటుందని వారు అంటుంటారు. 
 
ఈ నొప్పి ఉన్న స్త్రీకి సెక్స్‌లో పాల్గొన్నపుడు భావప్రాప్తి పొందలేక పోతుంటారు. తమ భర్తకు ఉన్న కామవాంఛను తీర్చేందుకు బలవంతంగా రతిలో పాల్గొంటుంటారు. కానీ, తమ సమస్యలను బయటకు చెప్పుకునేందుకు వీరు వెనుకాడుతుంటారు. ఇలాంటి నొప్పికి పలు కారణాలు లేకపోలేదని సెక్స్ వైద్య నిపుణులు చెపుతున్నారు. 
 
ఇలాంటి వాటిలో రిట్రోవర్టేడ్ యుటెరస్ కూడా ఒకటి. అంటే గర్భసంచి సహజమైన పొజీషన్‌లో లేకపోవటమే. సాధారణంగా యుటెరస్ గాల్ బ్లాడర్‌కి కొంత ముందుగా పైభాగంలో ఉంటుంది. దీనివల్ల మిగిలినవన్నీ పర్‌ఫెక్ట్‌గా ఉన్నప్పటికీ ఆయా స్త్రీలు సెక్స్ సమయంలో ఇబ్బంది పడతారు. 
 
గర్భసంచి సహజమైన స్థానంలో లేక రతి సమయంలో ఇబ్బందులు పడుతున్న మహిళల సంఖ్య ఐదు శాతం వరకు ఉన్నట్టు వైద్యులు చెపుతున్నారు. ఇలాంటి సమస్యలను వైద్య నిపుణులను సంప్రదించి సరిచేసుకుంటే సంసార జీవితం సాఫీగా సాగుతుందని సెక్సాలజిస్టులు చెపుతున్నారు.