శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : శుక్రవారం, 8 ఆగస్టు 2014 (15:35 IST)

సెక్సులో స్త్రీకి సుఖానుభూతిని కలిగించేది ఏమిటి?

శృంగారంలో పాల్గొనే మహిళలు వివిధ చర్యల ద్వారా సుఖానుభూతి పొందుతుంటారు. అయితే, యోని మార్గంలో ఇవి మరింత సుఖంగా కనిపిస్తాయి. అందుకే యోని మార్గాన్ని అత్యంత రహస్య మార్గంగా భావిస్తారు. ముఖ్యంగా యోని మార్గంలో ఒకటిన్నర అంగుళం లోపల మూత్రనాళం వైపు అదిమితే సుఖానుభూతి అమితంగా కలుగుతుందట. ఈ భాగానే 'జీ స్పాట్' అంటారు. కేవలం అదమడం (ఒత్తిడి) వల్లనే కాకుండా రతిలో కూడా ఇది బాగా స్పందించి మధురమైన సుఖానుభూతులని కలిగిస్తుంది. 
 
ఇకపోతే.. ఉపరతిలోనూ మరికొన్ని రతి భంగిమల్లోనూ స్త్రీకి సుఖానుభూతులు కలిగిస్తాయి. యోని శీర్షభాగానికి నేరుగా ఒరిపిడి కలగడమే దీనికి కారణంగా సెక్సాలజిస్టులు చెపుతున్నారు. అలాగే, యోనిశీర్షం కూడా అమిత ఆనందాన్ని కలిగిస్తుంది. ఇందుకు యోని చుట్టూ ఉండే కామనాడులే ప్రధానమని అంటున్నారు. 
 
అయితే, కొంతమంది స్త్రీలకు జీ స్పాట్‌ను, యోని శీర్షాన్ని ప్రేరేపించినా ఎలాంటి సెక్స్ ప్రేరణలు కలగవు. అంతమాత్రాన వారిలో యోనిశీర్షం లేదా కామ కోర్కెలు లేవని అర్థంకాదు. కామనాడులూ లేవని కాదు. ఇలాంటి వారిలో యోనిమార్గంలో వేలు పెట్టి మూత్రనాళం వైపు అదిమితే ఈ కామనాడులు స్పందించి సుఖానుభూతులు కలుగుతాయని సెక్స్ నిపుణులు చెపుతున్నారు.