గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : శుక్రవారం, 21 నవంబరు 2014 (17:32 IST)

వక్షోజాలు, పిరుదులను పురుషులు అమితంగా ఇష్టపడతారెందుకు?

నా పేరు శ్రావణి. సైన్స్ విద్యార్థిని. పీజీ చేస్తున్నా. నాకో సందేహం ఉంది. చాలా మంది పురుషులు లేదా యువకులను స్త్రీల వక్షోజాలు, పిరుదులను మాత్రమే అమితంగా ఇష్టపడతారు ఎందుకని? నన్ను కూడా నా క్లాస్‌మెట్స్ అలానే చూస్తుంటారు. అదే నా ఫ్రెండ్‌ వక్షోజాలు చిన్నవిగా ఎద ఫ్లాట్‌గా ఉంటుంది. ఆమెను అంతగా పట్టించుకోరు. ఎందుకో అర్థం కావడం లేదు. వివరించరూ? 
 
ఇక్కడ ప్రత్యేకించి చెప్పడానికి ఏం లేదు. కొందరు పురుషులు వక్షోజాలను, మరికొందరు పిరుదులను, ఇంకొందరు నేత్రాలను, పెదాలను, వెంట్రుకలను ఇలా ఎవరికి నచ్చింది వారు ఇష్టపడుతుంటారు. పురుషుడు ఒక మహిళలో అనేక భాగాలను ఇష్టపడతాడు. అయితే, పిరుదులు, వక్షోజాలకు మాత్రం ప్రత్యేక ఉంది. అందుకే వాటిని అమితంగా ఇష్టపడతారు. తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో కూడా పురుషుడు మహిళ ఎద భాగం (వక్షోజ భాగం), గుండ్రని ముఖం, పెదాలు, నేత్రాలను అమితంగా ఇష్టపడుతుండగా, స్త్రీలు మాత్రం పురుషుల బాడీ లాంగ్వేజ్, మాటలు, నడక తీరును ఇష్టపడుతున్నట్టు తేలింది.