గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : మంగళవారం, 15 జులై 2014 (19:24 IST)

వయస్సు 18 ఏళ్లు.. రోజుకు ఆరేడుసార్లు హస్తప్రయోగం చేస్తా.. హానికరమా?

నా వయస్సు 18 యేళ్లు. నేను 13వ యేటనే రజస్వల అయ్యాను. అయితే, నాకు గత మూడునాలుగేళ్లుగా బహిష్టులు సక్రమంగా రావడంలేదు. కారణం తెలియడం లేదు. వైద్యుల వద్దకు వెళ్లలేదు. పెద్దవారితోనూ ఈ విషయం చెప్పలేదు. అదేసమయంలో నాకు సెక్స్ కోర్కెలు ఎక్కువ. దీంతో రోజుకు ఆరేడుసార్లు హస్త ప్రయోగం చేసుకుంటా. ఖాళీ దొరికినపుడల్లా ఇదే పనిలో ఉంటా. ఇలా చేసుకోవడం ఆరోగ్యానికి హానికరమా సలహా ఇవ్వండి? 
 
సాధారణంగా యుక్త వయస్సుకు వచ్చిన ఆడపిల్లలో సెక్స్ కోర్కెలు ఎక్కువగా ఉంటాయి. దీంతో వారు స్వయంతృప్తి కోసం హస్త ప్రయోగం చేసుకుంటుంటారు. ఈ అలవాటు చాలా మంది యువతుల్లో ఉంటుంది. ఇదేమీ తప్పు కాదు. అయితే, ఈ తరహా అలవాటు వల్ల మెన్సస్ సరిగా రాకపోవడమో లేదా పెళ్లయ్యాక పిల్లలు పుట్టక పోవడం వంటివి జరగనే జరగవు. 
 
ఈ విషయంలో ఎవరెన్ని చెప్పినా మీరు నమ్మకండి. అయితే, కొందరు యువతులకు ప్రతినెలా సక్రమంగా మెన్సస్ కాకపోవడానికి వారిలో ఆదుర్థా, ఆందోళనలే ప్రధాన సమస్యగా ఉంటాయి. ఆ పరిస్థితులు కుటుంబ పరిస్థితుల వల్ల లేదా విద్యాభ్యాసంలో వచ్చే టెన్షన్ వల్ల కావొచ్చు. అయితే, ఇలాంటి ఆందోళన నుంచి ఎలా ఉపశమనం పొందాలో తెలుసుకుంటే అన్నీ అనుకూలంగానే జరిగిపోతుంటాయి.