శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. »
  3. ఆరోగ్యం
  4. »
  5. దాంపత్యం
Written By PNR

ఆఫీసులో సాయం చేస్తాడు.. ఓసారి సెక్స్ కావాలంటున్నాడు? ఏంచేయాలి?

File
FILE
నేను కర్నూలులో ఓ ప్రభుత్వ శాఖలో గుమస్తాగా పని చేస్తున్నా. సహ ఉద్యోగి ప్రతి పనిలోనూ నాకు సాయపడుతున్నారు. నాలుగైదేళ్లుగా ఇలాగే కలిసి మెలిసి ఉంటున్నాం. ఆయనకు వివాహమైంది. నాకు వివాహం కాలేదు. అతనికి ఏదో విధంగా సహాయపడదామని అనుకుంటే వద్దు అంటాడు. ఇంకేంకావాలని అడిగితే.. ఓసారి శారీరకంగా కలుద్దామంటున్నాడు. ఏం చేయాలి? అతనికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. సాయం చేస్తున్నందుకు అతని ప్రపోజల్‌కు సమ్మతించాలా లేక వద్దని దూరం చేసుకోవాలా? ఏం చేయమంటారు?

అతను కేవలం మీకు సాయం చేస్తున్నది.. మిమ్మలను అనుభవించాలన్న ఏకైక ఉద్దేశ్యంతోనే. అంతేకానీ, ఒక మహిళగా మీకు సాయపడాలన్న ఉద్దేశ్యం అతనికి లేదు. అతనికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారని చెపుతున్నారు. మీకు వివాహం కాలేదని అంటున్నారు.

అంటే.. మీకు సాయం చేస్తున్నట్టుగా చేసి మిమ్మలను తన వశం చేసుకోవాలన్న లక్ష్యంతో ఉన్నాడు. ఆ విషయాన్ని మీకు నేరుగానే చెప్పారు. అందువల్ల ఆఫీసు పనిలో సాయపడుతున్నాడనే సాఫ్ట్ కార్నర్‌తో అతని ప్రపోజల్‌కు మీరు బలికావొద్దు. అతనికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.