శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. »
  3. ఆరోగ్యం
  4. »
  5. దాంపత్యం
Written By PNR

నా భర్త ఫ్రెండ్‌‍కు భార్యలేదు.. జాలేసి కోర్కె తీరుస్తున్నా.. తప్పారైటా?

File
FILE
మాది విజయవాడ. మావారు ఓ యేడాది క్రితమే రిటైర్ అయ్యారు. ఆయన స్నేహితుడు మా ఇంటికి అపుడపుడూ వస్తుంటారు. మా ఆయనతో గొడవ పడితే అతన్ని ఇంటికి పిలిచి చనువుగా మాట్లాడేదాన్ని. ఓ రోజు అతని గురించి వాకబు చేయగా.. అతనికి భార్య లేదని తెలిసింది. దీంతో జాలేసి అతని కోర్కె తీరుస్తున్నా. అతనితో కలిసిన రోజు ప్రత్యేకమైన అనుభూతిని పొందుతున్నా. ఆ సుఖాన్ని మరిచిపోలేక పోతున్నా. అయితే, నేనే చేసేది మంచిదా.. లేక నా భర్తకు ద్రోహం చేస్తున్నట్టా? సలహా ఇవ్వగలరు.

ముమ్మాటికీ తప్పే. భర్త ఉండగా, మరో మగాడితో ఇలా చేయడం భావ్యం కాదు. ఈ చర్య భర్తకు ద్రోహం చేసినట్టే అవుతుంది. ముఖ్యంగా మీవారి స్నేహితుడు అని చెపుతున్నారు. మీరు చనువుగా ఉండటం వల్లే అతను మీ చేయి పట్టుకున్నాడు. మీరు అతనిపట్ల సానుభూతితో ఉండటంతో సులభంగా లొంగిపోయారు. భర్త లేడని తెలిసిన తర్వాత మరింత జాలితో అతనితో పడక సుఖం అనుభవిస్తూ.. మీ భర్తకు ద్రోహం చేస్తున్నారు. అందువల్ల వెంటనే అతనితో సంబంధాన్ని తెంచుకోండి. ఇంటికి రావొద్దని చెప్పండి. భార్యలేదని అతనిపై జాలి చూపితే.. రేపు మీ భర్తకు తెలిస్తే మీ సంసారమే నాశనమవుతుంది. జాగ్రత్త.