శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 18 మార్చి 2015 (16:33 IST)

రాత్రిపూట హాయిగా నిద్రపోవాలంటే.. 5 బెస్ట్ ఫుడ్స్ తీసుకోండి!

నిద్రలేమి వేధిస్తుందా..? రాత్రిపూట హాయిగా నిద్రపోవాలనుకుంటున్నారా? అయితే ఈ 5 బెస్ట్ ఫుడ్స్ తీసుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చెర్రీ పండ్లను నిద్రించేందుకు ఒక గంట ముందు తీసుకుంటే హాయిగా నిద్రపోతారు. పిల్లలకు సైతం రాత్రిపూట ఓ చెర్రీ ఫ్రూట్ ఇవ్వడం ద్వారా శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. అలాగే నిద్రించే ముందు పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా కలిగివుండే అరటి పండును తీసుకోవడం మంచిది. ఇందులోని ఆమ్లాలు హాయిగా నిద్రపోనిస్తాయి. 
 
ఇకపోతే.. పిండిపదార్థాల్లో ఇన్సులిన్ హార్మోన్ ఉంటుంది. దీనిద్వారా ఈజీగా హాయిగా నిద్రపట్టేస్తుంది. అందుచేత బ్రెడ్ టోస్ట్‌ను రాత్రిపూట రెండేసి తీసుకుంటే మంచిది. ఓట్ మీల్ కూడా హాయిగా నిద్రపుచ్చుతుంది. గోరువెచ్చని పాలును ఓ గ్లాసుడు తీసుకోవాలి. ఇందులోని క్యాల్షియం హాయిగా నిద్రపట్టేలా చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇకపై నిద్రలేమితో బాధపడనక్కర్లేదు. నిద్రమాత్రలు మింగనక్కర్లేదు. ఈ ఫుడ్స్ తీసుకుంటే సరిపోతుంది.