మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 26 మే 2017 (10:57 IST)

ముడతల చర్మానికి కమలాపండుతో చెక్.. ఎలా?

కమలాపండ్లను తినడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనకరమే కాకుండా అందం కూడా పెరుగుతుంది. చర్మాన్ని కాంతులీనేలా చేస్తాయి. వృద్ధాప్య ఛాయల్ని తగ్గిస్తాయి. కమలాపండును యథాతథంగా తిన్నా, రసాన్ని తాగినా రక్తం శుద్ధి అవు

కమలాపండ్లను తినడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనకరమే కాకుండా అందం కూడా పెరుగుతుంది. చర్మాన్ని కాంతులీనేలా చేస్తాయి. వృద్ధాప్య ఛాయల్ని తగ్గిస్తాయి. కమలాపండును యధాతథంగా తిన్నా, రసాన్ని తాగినా రక్తం శుద్ధి అవుతుంది. కండరాలు బలంగా అవుతాయి. ముడతలు, మచ్చలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి. కమలా తొక్కల్ని ఎండబెట్టి పొడి చేసుకుని వివిధ మార్గాల ద్వారా సౌందర్య సాధనంగా ఉపయోగించుకోవచ్చు. 
 
జిడ్డు చర్మం ఉన్నవారు ముల్తానిమట్టి, కమలాపండు తొక్క, గంధం పొడి సమపాళ్లలో తీసుకుని ఒక టీ స్పూన్ టొమేటో గుజ్జుతో కలిపి చర్మానికి మర్దన చేయాలి. ఇలా వారానికి రెండు నుంచి మూడుసార్లు చేస్తే ముఖం కాంతిలీనుతుంది.
 
కాంబినేషన్ స్కిన్ ఉన్నవారు రెండు చుక్కలు ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ తీసుకుని ముఖానికి మర్దన చేయాలి. ముఖాన్ని వేడి నీళ్లలో ముంచిన శుభ్రమైన టవల్‌తో కంప్రెస్ చేయాలి.
 
ముడతల చర్మం ఉన్నవారు ఒక టేబుల్ స్పూన్ ఓట్స్‌లో, పెరుగు కలిపి పేస్టులా తయారు చేసుకుని, దానిలో ఒక టీ స్పూన్ యాపిల్ తురుము, రెండు చుక్కలు ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ కలుపుకుని ముఖానికి మాస్క్ వేయాలి. ఇలా వారానికి రెండు, మూడుసార్లుగా చేస్తుంటే ముడతలు తగ్గుతాయి.