Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రోజుకు ఓ కప్పు కొబ్బరి పాలు తీసుకుంటే...?

శుక్రవారం, 30 జూన్ 2017 (15:21 IST)

Widgets Magazine

దక్షిణ భారతదేశంలోని కేరళ వంటి రాష్ట్రాల్లో కొబ్బరి నూనెను ఎక్కువగా వంటకాల్లో ఉపయోగిస్తారు. పూర్తిగా పక్వానికి వచ్చిన కొబ్బరికాయ కొబ్బరి నుంచి తయారయ్యే 'కొబ్బరి పాల'తోనూ మనకు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. చాలామంది కొబ్బరి నీరు, కొబ్బరి పాలు ఒకటేననుకుంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే కొబ్బరినీరు టెంకాయలో సహజసిద్ధంగా తయారవుతుంది. కొబ్బరిపాలను పూర్తిగా పండిన కొబ్బరి నుంచి తయారు చేస్తారు. ఈ 'పాల'ను తరచూ తీసుకోవడం వల్ల కలిగే లాభాలను పొందవచ్చు.
 
ఎముకలకు దృఢత్వం : - పాస్ఫరస్, కాల్షియం వంటి పోషకాలు ఎక్కువగా ఉండడంతో ఎముకలకు దృఢత్వం లభిస్తుంది. కొబ్బరి పాలలో ఉండే గ్లూకోజ్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు దోహదపడుతుంది. ఇది రక్తంలో చక్కెర నిల్వలు తక్కువగా ఉన్న వారికి ఎంతగానో ఉపయోగపడతాయి. కీళ్ల నొప్పులకు కొబ్బరి పాలు మందులా పనిచేస్తాయి. ఆర్థరైటిస్‌కు చక్కని మందుగా పనిచేస్తాయి. శరీరంలో ఏర్పడే ఒత్తిడి కూడా తగ్గుతుంది. రోజుకో కప్పు కొబ్బరి పాలను తీసుకుంటే రక్తహీనత తొలగిపోతుంది.
 
వెంట్రుకలు రాలకుండా:- కొబ్బరి పాలలో నిమ్మరసం కలిపి ఫ్రిజ్‌లో 2-3 గంటల పాటు ఉంచాలి. అనంతరం బయటికి తీసి దానిపైన ఏర్పడిన పొరను తొలగించాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి మాడుకు పట్టించి వేడి నీటిలో ముంచిన ఉన్ని టవల్‌ను తలకు చుట్టాలి. గంట సేపు అలాగే ఉంచి షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి 2 సార్లు ఇలా చేస్తూ ఉంటే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. జుట్టు మృదువుగా తయారవుతుంది.
 
బరువు తగ్గించే దివ్యౌషధం: - కొద్ది మొత్తంలో కొబ్బరి పాలను తీసుకున్న కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. అంతేకాదు ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఇవి బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడతాయి. యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు కొబ్బరి పాలలో సమౄఎద్ధిగా ఉన్నాయి. ఇవి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి.


Widgets Magazine

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

భార్యాభర్తలు శారీరక సుఖానికి దూరమైతే...

భార్యాభర్తలు లేదా స్త్రీపురుషుల మధ్య జరిగే శారీరక సంబంధం (శృంగారం) అనేది తాత్కాలిక ...

news

మతిమరుపుకు దివ్యౌషధంగా పనిచేసే కాఫీ

వృద్ధాప్యంతో సంబంధం లేకుండా చాలామందిని భయపెడుతున్న సమస్య మతిమరుపు. అలాంటి మతిమరుపుకు కాఫీ ...

news

దంపతులు నిద్రలేమిని అంత సులభంగా తీసుకోకూడదట.. ఎందుకంటే?

దంపతులు నిద్రలేమిని అంత సులభంగా తీసుకోకూడదంటున్నారు.. అమెరికా శాస్త్రవేత్తలు. దంపతుల్లో ...

news

ఎంత తింటున్నామనేది తెలియకుండా పొట్ట నిండా లాగించేస్తే...

సాధారణంగా పని ఒత్తిడిలో సమయానికి భోజనం చేయడం చాలామంది మరచిపోతుంటారు. పని ఒత్తిడి ...

Widgets Magazine