Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఒక చెంచాడు గోరింటాకు రసాన్ని తాగితే ఏమవుతుంది?

సోమవారం, 10 జులై 2017 (20:15 IST)

Widgets Magazine

తెలుగువారు కన్నెపడుచుల చేతిపంట గోరింట ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఆడపిల్లలంతా ముందు గోరంట కోసం ఎదురు చూస్తూ వుంటారు. ముఖ్యంగా యుక్తవయస్కులు అయిన వారు, పిల్లలు ఆషాఢ మాసంలో పుట్టింటికి వచ్చిన కొత్త పెళ్ళికూతుళ్ళు గోరింటాకును ఆనందంగా పెట్టుకొనే వారు. ఇప్పుడు గోళ్ళకు కృత్రిమంగా తయారుచేసిన రంగుల్ని, గోరింటాకును వాడుతున్నారు. 
 
henna
ఒకప్పుడు గోరంటాకునే ఆందంగా గోళ్ళకు పెట్టుకొనేవారు. గోరింటాకులో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. వేళ్ళ మధ్య ఇన్‌పెక్షన్ వచ్చినపుడు, గోరు పుచ్చిపోతుంటే తరచుగా గోరింటాకు నూరి పెట్టుకుంటే వ్యాది తగ్గిపోతుంది. అరికాళ్ళు మంటగా ఉన్నపుడు గోరింటాకును మెత్తగా నూరి వాటిపై వ్రాస్తే అరికాళ్ళమంట తగ్గుతుంది.
 
వేడిచేసినపుడు వచ్చే సెగ గడ్డలు వచ్చినపుడు ఈ సమయంలో గోరంటాకును మెత్తగా నూరి సెగ గడ్డలపైన రాస్తే గడ్డలు పగిలి చీము బయటకు వచ్చి నొప్పి తగ్గుతుంది. పుండు కూడా త్వరగా మానుతుంది. కీళ్ళనోప్పులుంటే గోరింటాకును నూరి కీళ్ళకు పట్టు వేస్తే తగ్గుతుంది.
 
మూత్రము వెంట వీర్యము పోయినపుడు గోరింటాకు రసాన్ని రోజుకు ఒకసారి ఒక చిన్న చెంచాడు త్రాగుతుంటే తగ్గుతుంది. తలలో చుండ్రువున్నా, జుట్టు రాలిపోతున్నా, చిన్న వయస్సులో వెంట్రుకలు తెల్లబడుతున్నా, జుట్టు వత్తుగా పెరగాలన్నా, గోరింటాకును వాడటం మంచిది.
 
గోరింటాకును మెత్తగా నూరి ఒక ఇనుప మూకుడులో రాత్రంతా నానబెట్టి తెల్లవారాక తలకు పట్టించాలి. తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టులో వున్న సమస్యలను నివారించవచ్చు. హెయిర్ డైలు వాడవలసిన అవసరం రాదు. గోరింటాకును వాడడం వలన చేతులుకు అందంమే కాక జుట్టు కూడా అందంగా తయారవుతుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

పెళ్లయిన కొత్తలో భార్యను వేధించే ఆ సమస్య

సాధారణంగా పెళ్లయిన కొత్తలో శృంగారంలో పాల్గొన్న యువతిలో ఆనందం కంటే నొప్పి, బాధ ఎక్కువగా ...

news

నూనెతో వేయించిన రొయ్యల్ని అతిగా తినకండి.. కూరలే బెస్ట్..

రొయ్యలు రుచిగా వుంటాయని ఎక్కువ నూనెతో వేయించిన వేపుళ్లతో తినకుండా.. తక్కువ నూనె వాడి ...

news

సైకిల్ వాడకం .. ఉపయోగాలు...

ప్రస్తుత హైటెక్ జీవితంలో సైకిల్ తొక్కడం అనేది చాలా మంది నామూషిగా భావిస్తున్నారు. కానీ, ...

news

నాజూగ్గా కనిపించాలంటే రోజుకు అరగంట కాదు.. పది నిమిషాలైనా నడవండి..

నాజూగ్గా కనిపించాలంటే.. వారానికి ఓ గంట వ్యాయామం చేయాల్సిందే. లేకుంటే రోజుకో అరగంట ...

Widgets Magazine