శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : సోమవారం, 23 ఫిబ్రవరి 2015 (16:03 IST)

వృద్ధాప్య ఛాయలను తొలగించుకెోవాలంటే.. ఏం చేయాలి?

ఒత్తిడి, కాలుష్యంతో చర్మంపై ఏర్పడే ముడతలతో ఏర్పడే అకాల వృద్ధాప్య ప్రమాదాన్ని ఆరోగ్యకరమైన ఆహారంతో నివారించవచ్చునని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

యాంటీఆక్సిడెంట్లు, పండ్లు ఎక్కువగా తీసుకుంటూ కొన్ని రకాల ఆరోగ్యకరమైన ఆహార చిట్కాలు పాటించడం ద్వారా చర్మాన్ని అందంగా ఉంచుకోవచ్చు. 
 
యాంటీయాక్సిడెంట్లు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో దెబ్బతిన్న కణాలను బాగు చేయడంతో పాటు శరీరం అంతటా సమతులంగా ఉంచుతాయి. దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులైన డయాబెటిస్, కేన్సర్, గుండెజబ్బులను సైతం నివారించడానికి తోడ్పడతాయి. గుమ్మడికాయలు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. 
 
వెన్న, వనస్పతి, ఇతర నూనెలకు ప్రత్యామ్నాయంగా కొబ్బరి నూనెతో ఉడికించిన ఆహారం తినడం మేలు. క్రమం తప్పకుండా సమతుల ఆహారం, స్నాక్స్ తీసుకోవడం మేలు.  రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే ఆహారం తీసుకోవాలి. ఆహారంలో ఓట్స్ చేర్చుకోవాలి. తగిన నిద్ర అవసరం. ప్రతిరోజూ 20 నిమిషాల పాటు నడక ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.