శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 25 మే 2015 (17:38 IST)

ఆపిల్స్ తీసుకుంటే విస్కీ తాగాలనే తోచదట..

ఆపిల్ ఆరోగ్యానికి మంచి టానిక్. ఇది శరీరానికి కావలసిన పీచును అందిస్తుంది. పండ్లలో ఆపిలే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆపిల్‌లో పీచు, విటమిన్స్, సిట్రిక్ ఆమ్లం, ఫాస్పరస్ వంటివి పుష్కలంగా ఉన్నాయి.

ఇవి ఉదర సమస్యలను దూరం చేస్తాయి. మద్యపానం సేవించే వారిలో రక్తంలో ఆల్కహాల్ స్థాయిని తగ్గిస్తుంది. విస్కీలోని గుణాలు ఆపిల్‌లో ఉన్నాయి. ఆపిల్స్ తీసుకుంటే విస్కీ తీసుకోవాలనే ఆలోచన ఉండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  
 
ఆపిల్ జ్యూస్‌ను తీసుకోవడం ద్వారా శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసినట్లవుతుంది. ఉదర సమస్యలకు చెక్ పెట్టాలంటే... పంచదార కలపని ఆపిల్ జ్యూస్‌ను తీసుకుంటే.. కడుపులోకి హైడ్రోక్లోరిన్ ఆమ్లం కార్బనిక్ ఆమ్లంగా మారిపోతుంది. తద్వారా గొంతునొప్పి వంటివి ఉండవు. అజీర్ణ సమస్యలను దూరం చేసుకోవచ్చు.

ఆపిల్ రోజువారీ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు. ఆపిల్‌లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉండటం ద్వారా పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.