శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శనివారం, 18 ఫిబ్రవరి 2017 (16:10 IST)

మర్రిపాలలో తేనెని కలిపి కొద్దిగా ఇంగువని కలిపి తీసుకుంటే....

ఇంగువ కూరలలో ఉపయోగించి ఆహారంగా తీసుకోవడం ద్వారా రుచితో పాటు ఆరోగ్యం కూడా చేకూరుతుంది. అజీర్తితో బాధపడే వారు రోజూ కూరల్లో కొంచెం ఇంగువ వేసుకొని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కడుపులో మంట, అన్నం అరగకపోవడం వంటి సమస్యలు దూరమవుతాయి. గ్లాసు నీళ్లలో, లే

ఇంగువ కూరలలో ఉపయోగించి ఆహారంగా తీసుకోవడం ద్వారా రుచితో పాటు ఆరోగ్యం కూడా చేకూరుతుంది. అజీర్తితో బాధపడే వారు రోజూ కూరల్లో కొంచెం ఇంగువ వేసుకొని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కడుపులో మంట, అన్నం అరగకపోవడం వంటి సమస్యలు దూరమవుతాయి. గ్లాసు నీళ్లలో, లేదంటే మజ్జిగలో చిటికెడు ఇంగువ పొడి వేసుకుని తాగినా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. ఇంగువకి రోగనిరోధకశక్తి ఎక్కువ. రుతుసమస్యల్ని తగ్గిస్తుంది. 
 
ఇందువల్లనే బాలింతలకు ఇచ్చే ఆహారం లో ఇది ముఖ్యమైన పదార్ధం. చెంచా తేనెలో కొద్దిగా ఇంగువ, సన్నగా తరిగిన అల్లం ముక్కలూ చేర్చి తీసుకొంటే గొంతు మంట తగ్గుతుంది. జలుబూ, దగ్గూ అదుపులోకి వస్తాయి. శ్వాసకోశ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.క్యాబేజీ, బంగాళాదుంప వంటివి తిన్నప్పుడు కడుపులో గ్యాస్‌ చేరుకుని ఇబ్బంది పెడుతుంది. ఒక్కోసారి కడుపునొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్య బాధించకుండా ఉండాలంటే ఈ కూరలు వండేటప్పుడు చిటికెడు ఇంగువ వేస్తే చాలు గ్యాస్‌ సమస్య బాధించదు. 
 
రక్తపోటును అదుపులో ఉంచే పోషకాలు ఇంగువలో ఉన్నాయి. నెలసరి సమస్యల నుంచి సత్వర పరిష్కారం లభిస్తుంది. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. ఆస్తమాతో బాధపడే వారు ఇంగువను తీసుకోవడం వల్ల సమస్య అదుపులో ఉంటుంది.రెండు చెంచాల తేనెను 2,3 సెంటి గ్రాముల ఇంగువ పొడిని, తెల్ల ఉల్లి రసం, తమలపాకుల రసం కలిపి తీసుకుంటె శ్వాసకోశవ్యాధులు దూరంగా ఉంటాయి. హిస్టీరియాతో బాధపడే వారికి ఇంగువ వాసనని చూపిస్తే ఫలితం బాగుంటుంది. లైంగిక పటుత్వం తగ్గినవారిలో ఇంగువని వాడుకోవచ్చు. మర్రిపాలలో తేనెని కలిపి కొద్దిగా ఇంగువని కలిపి తీసుకుంటే 40 రోజులలో మంచి గుణం కనిపిస్తుంది.