గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chitra
Last Updated : మంగళవారం, 12 జనవరి 2016 (11:05 IST)

చేతిగోళ్లు కాంతివంతంగా కనిపించాలా...!

చలికాలంలో బయటికి వెళ్లాలంటేనే అందరికీ భయంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా చలికాలంలో బయటికి వెళ్లినప్పుడు చేతులు కూడా చాలా ప్రభావితమవుతాయి. 
 
కొందరికి చేతిగోళ్లు చాలా గట్టిగా ఉంటాయి. కట్ చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంటాయి. అలాంటి గోళ్లు ఉన్నవాళ్లు కాసేపు నీటిలో చేతిగోళ్లు తడిసేలా ఉంచి కట్ చేస్తే చాలా సులభంగా కట్ చేయచ్చు.
 
చేతిగోళ్లకి కాస్త కొబ్బరి నూనె రాసి కాసేపు తర్వాత కట్ చేస్తే కూడా సులభంగా కట్ అవుతుంది. గోరువెచ్చని నీటిలో కాస్త ఉప్పు కలపాలి. ఆ నీటిలో చేతివేళ్లను కాసేపు ఉంచితే ఎంతో అందంగా కనిపిస్తాయి. 
 
గోరువెచ్చని ఆలివ్‌నూనెను తీసుకుని చేతులకు మర్దన చేస్తుండాలి. దీనివల్ల మృదువుగా ఉంటాయి. చేతులు, చేతిగోళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం నెలకోసారి మెనిక్యూర్ చేయించుకోవాలి.
 
చేతులు నల్లగా కనిపిస్తుంటే  బయటకు వెళ్తున్నప్పుడు సన్ స్క్రీన్ తప్పనిసరిగా రాయాలి. అరకప్పు నిమ్మరసంలో కొద్దిగా పంచదార కలిపి చేతులకు పట్టించాలి. మృతచర్మం పోయి చేతులు అందంగా కనిపిస్తాయి.