గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శనివారం, 29 జులై 2017 (14:45 IST)

ఎండిన ద్రాక్షల్ని నేతిలో వేయించి తింటే?

ద్రాక్షలు ఎండినా మేలే.. పచ్చిగా వున్నా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ద్రాక్షల్లో పలురకాలున్నాయి. ద్రాక్షపండ్లను అలాగే తిన్నా.. లేకుంటే జ్యూస్ తాగినా గుండెకు మేలు చేసినవారమవుతాం. ద్రాక్ష పండ్లను పన్నీరులో

ద్రాక్షలు ఎండినా మేలే.. పచ్చిగా వున్నా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ద్రాక్షల్లో పలురకాలున్నాయి. ద్రాక్షపండ్లను అలాగే తిన్నా.. లేకుంటే జ్యూస్ తాగినా గుండెకు మేలు చేసినవారమవుతాం. ద్రాక్ష పండ్లను పన్నీరులో నాననబెట్టి రసం పిండుకుని తాగడం చేస్తే గుండెపోటు దూరమవుతుంది. ఉదర సంబంధిత వ్యాధులు నయం కావాలంటే.. ద్రాక్ష రసాన్ని మూడు పూటలా అర గ్లాసు మేర తీసుకోవాలి. 
 
20 గ్రాముల ఎండిన ద్రాక్షల్ని నేతిలో వేయించి తింటే జలుబు, దగ్గు దూరమవుతుంది. మాంసాహారం తీసుకోని వారు... రోజూ ద్రాక్ష పండ్లను తీసుకోవడం ద్వారా మాంసాహారానికి ధీటుగా ప్రోటీన్లను పొందవచ్చు. రోజూ ద్రాక్ష పండ్లను తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఉదయం పూట పరగడుపున ఒక గ్లాసుడు ద్రాక్ష రసం తీసుకుంటే తలనొప్పికి చెక్ పెట్టవచ్చు. 
 
నెలసరి నొప్పులు, సమస్యలను ఎదుర్కొనే మహిళలు, ఇక గర్భిణీ మహిళలు ప్రతిరోజూ ఉదయం పరగడుపున ద్రాక్ష రసం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పిల్లల ఆరోగ్యానికి కూడా ద్రాక్ష రసం మేలు చేస్తుంది. దంతాలు, మెదడును ద్రాక్ష పండ్లు చురుగ్గా వుంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.