శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 30 జనవరి 2017 (12:42 IST)

వేడి వేడి పాలలో బెల్లం కలుపుకుని తాగితే.. బరువు తగ్గుతారు.. చుండ్రు మటాష్

బెల్లంలో ఆరోగ్యానికి మేలు చేసే ప్రయోజనాలెన్నో వున్నాయి. రుతు స‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు వ‌చ్చే వివిధ ర‌కాల స‌మ‌స్య‌లు, ప్ర‌ధానంగా క‌డుపునొప్పి త‌గ్గాలంటే... వేడి పాలలో బెల్లం వేసుకుని తాగాలి. అనీమియాను ఇది ద

బెల్లంలో ఆరోగ్యానికి మేలు చేసే ప్రయోజనాలెన్నో వున్నాయి. రుతు స‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు వ‌చ్చే వివిధ ర‌కాల స‌మ‌స్య‌లు, ప్ర‌ధానంగా క‌డుపునొప్పి త‌గ్గాలంటే... వేడి పాలలో బెల్లం వేసుకుని తాగాలి. అనీమియాను ఇది దూరం చేస్తుందట. పాలను తాగడం ద్వారా రక్తహీనతను దూరం చేసుకోవచ్చు. అందులో బెల్లం కాస్త కలుపుకుని సేవిస్తే బరువు తగ్గుతారు.
 
బెల్లం క‌లిపిన వేడి పాలలో స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌, యాంటీ వైర‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల అవి అనారోగ్యాల‌ను క‌లిగించే వైర‌స్‌లు, బాక్టీరియాల భ‌ర‌తం ప‌డ‌తాయి. దీంతో ప‌లు ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.
 
వేడివేడి పాలలో బెల్లం కలుపుకుని తాగితే బరువు తగ్గిపోతారు. ఇది శ‌రీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును త‌గ్గిస్తాయి. ఇలా చేస్తే జుట్టు కాంతివంతంగా మారుతుంది. హెయిర్ ఫాల్ ఉండదు. చుండ్రు మటాష్ అవుతుంది. కీళ్ళ నొప్పులు దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.